శశికళ ఏమడిగింది...? జైలర్ ఏమిచ్చారు?

శశికళ ఏమడిగింది...? జైలర్ ఏమిచ్చారు?

జయలలితకు నెచ్చెలిగా పోయస్ గార్డెన్లో సకల సౌకర్యాలు అనుభవించిన శశికళ పొరుగురాష్ట్రం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఇప్పుడు ఒక సాధారణ ఖైదీగా గడపాల్సి వస్తోంది. అయితే... వీఐపీ ఖైదీ హోదా సౌకర్యాల కోసం ఆమె ట్రయ్ చేస్తున్నారు. ఆమె డిమాండ్లు భారీగా ఉండగా అధికారులు అన్నిటిని తోసిపుచ్చి కొన్ని సాధారణ సౌకర్యాలు మాత్రం ప్రత్యేకంగా కల్పించారు.

జైలు అధికారులు ఖైదీలుగా శశికళకు 9234, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్లను కేటాయించారు.  ఈ కేసులో ఇదివరకే శశికళ ఆరునెలల శిక్షను అనుభవించడంతో మరో మూడున్నరేళ్లు శశికళ జైలులోనే ఉండనున్నారు. జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని శశికళ తరఫున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

జైలులో తనను వీఐపీ ఖైదీగా చూడాలన్న విజ్ఞప్తిని కూడా కోర్టు పరిగణననలోకి తీసుకోలేదు. దీంతో జైలులో శశికళ అందరి ఖైదీల్లాగే గడపనున్నారు. వైద్య పరీక్షలు చేయించుకొని జైలులోకి అడుగుపెట్టిన శశికళకు ఖైదులకు కేటాయించే వస్త్రాలను అందజేశారు. ఆదివారం నుంచి ఆమెకు పని కేటాయిస్తారు. కాగా ఇళవరసి, శశికళ ఒకే గదిలో ఉండనున్నారు. వారితో పాటు మరో ఇద్దరు వేరే ఖైదీలు కూడా ఉండనున్నారు.

శశికళ ఏమడిగింది...?
* ఏసీ రూం
* ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం
* జయలలితను ఉంచిన ప్రత్యేక బ్యారక్‌
* సహాయకురాలు

జైలు అధికారులు ఏం కేటాయించారు..
* ఒక మంచం
* 24 గంటల నీటి వసతి
* టీవీ
* వాకింగ్ ఏరియా
* వెస్టర్న కమోడ్‌
* మినరల్‌ వాటర్‌
* వేడినీళ్లు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English