జైలుకు శశిక‌ళ‌..రోజు కూలీ ఎంతో తెలుసా?

జైలుకు శశిక‌ళ‌..రోజు కూలీ ఎంతో తెలుసా?

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన శశికళ కేసులో అనూహ్య‌మైన వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన అనంత‌రం శశికళను జైలుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా,  జైలులో తనకు కావలసిన సదుపాయాల గురించి జైలు అధికారులకు శ‌శిక‌ళ‌ వినతిపత్రం సమర్పించారు. తనకు ప్రత్యేకంగా ఏసీ గది కేటాయించాలని, మినరల్‌ వాటర్‌ ఇవ్వాలని, ఇంటి ఆహారం ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే మంచం, టీవీ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. తన కోసం ప్రత్యేకంగా ఒక సహాయకురాలని నియమించాలని శ‌శిక‌ళ న్యాయ‌మూర్తికి మొర పెట్టుకున్నారు.

చిన్న‌మ్మ ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటినీ కోర్టు దీనికి తిర‌స్క‌రించింది. శశికళ ప్రత్యేక దుస్తులు వేసుకునే అవకాశం లేద‌ని పేర్కొంటూ ప్రత్యేక దుస్తుల అనుమతిని జైలు అధికారులు నిరాకరించారు. శశికళకు జైలులోనే దుస్తులను కేటాయిస్తారని తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు ఉండే సెల్‌లో శశికళ ఉంటారని జైలు అధికారులు చెప్పారు. ప్ర‌త్యేక ఖైదీగా ట్రీట్ చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, శశికళకు ఖైదీనంబర్‌ 10711 ను జైలు అధికారులు కేటాయించారు. అలాగే ఇళవరసికి ఖైదీనంబర్‌ 10712ను కేటాయించారు. కాగా, జైలులో శశికళ రోజుకు 50 రూపాయిలు సంపాదించే పనిని జైలు అధికారులు అప్పగించనున్నారు! జైలు అధికారులు వచ్చే ఆదివారం నుంచి శశికళకు పని కేటాయించనున్నారు. జైలులో తాను చేయాల్సిన పనిని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని శశికళకు ఇచ్చారు!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు