జైల్లో చిన్నమ్మ కోర్కెల చిట్టా

జైల్లో చిన్నమ్మ కోర్కెల చిట్టా

అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపణ అయి.. నాలుగేళ్ల  జైలుశిక్షను అనుభవించేందుకు చిన్నమ్మ సిద్ధం కావటం తెలిసిందే. జైలుకు వెళ్లే ప్రోగ్రామ్ ను వీలైనంత వరకూ పొడిగించేందుకు ఉన్న అవకాశాల్ని ప్రయత్నించి.. విఫలమై.. తప్పనిసరి పరిస్థితుల్లో బెంగళూరుకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఒకసారి జైల్లోకి వెళితే.. మళ్లీ ఎప్పటికి తిరిగి వస్తామన్న సందేహం ఉండటం వల్ల కావొచ్చు.. విమానంలో వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. కార్లో వెళ్లేందుకు ప్లాన్ చేశారు.

ఇదిలా ఉంటే.. జైల్లో తనకు కావాల్సిన వసతుల చిట్టాను.. చిన్నమ్మతరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసినట్లుగా చెబుతున్నారు. జైల్లో తనకు అవసరమైన వసతుల గురించి శశికళ పెట్టుకున్న చిట్టాను చూస్తే.. చిన్నమ్మ.. చిన్నమ్మే అనిపించక మానదు.

సుదీర్ఘ కాలం జైలుజీవితాన్ని గడపాల్సిన చిన్నమ్మ తనకేం వసతులు కావాలని కోరారన్న విషయాన్ని చూస్తే.. ఇరవైనాలుగుంటలూ మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని.. తనను ప్రత్యేక సెల్ లో ఉంచాలని కోరారు. వేడినీళ్లను కూడా తనకు ఏర్పాటు చేయాలని కోరారు. ఇవే కాక.. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని.. జైల్లో టీవీ సౌకర్యాన్ని అందించాలని.. వ్యక్తిగత సహాయకురాలిని అనుమతించాలని కోరినట్లుగా చెబుతున్నారు. మరి.. చిన్నమ్మ కోర్కెల చిట్టా విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. తప్పు చేసినట్లు రుజువై.. శిక్ష పడిన తర్వాత కూడా ఈ డిమాండ్లేమిటన్నది ఒకటైతే.. ఏ హోదాలో ఇన్ని డిమాండ్లను శశికళ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు