కొండా సురేఖ అసమ్మతి తగ్గలేదంట

కొండా సురేఖ అసమ్మతి తగ్గలేదంట

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలోనే ఉంటామని జగన్‌తో భేటీ అయ్యాక మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి చెప్పినప్పటికీ కొన్నాళ్ళ నుంచి వారిలో ఉన్న అసంతృప్తి ఇంకా వారిలో చల్లారనే లేదంట.

తెలంగాణ ప్రాంతంలో పార్టీ తమ కనుసన్నల్లో నడవాలని వారు జగన్‌ని కోరగా, జగన్‌ నుంచి స్పష్టంగా హామీ వారికి రాకపోవడంతో తమ అసహనాన్ని కొంచెం తగ్గించుకున్నట్లే కనిపిస్తున్నా అవకాశం చూసుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి షాక్‌ ఇవ్వాలనుకుంటున్నార్ట కొండా దంపతులు. రాజకీయాలలో ఇలాంటివి తరచూ జరిగేవే.

కొండా సురేఖ కన్నా ఆయన భర్త కొండా మురళి ఇలాంటి అసంతృప్తి విషయాలను నడపడంలో దిట్ట. ఆయనే కొండా సురేఖను ముందు పెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి చెమటలు పట్టిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అధినేత జైల్లో ఉంటే నేతలు ఇలాంటి పిల్లి మొగ్గలు వేయకుండా ఉంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English