స్టార్స్ అందరూ ఆయన వైపే

స్టార్స్ అందరూ ఆయన వైపే

రాఘవ లారెన్స్ కు తమిళనాట మంచి ఫాలోయింగే ఉంది. తమిళతనానికి అచ్చమైన ప్రతినిధిలా కనిపించే లారెన్స్.. అక్కడి మాస్ జనాలకు బాగా దగ్గరైపోయాడు. సేవా కార్యక్రమాలకు కోట్లు కోట్లు ఖర్చు చేస్తూ అక్కడి జనాల మనసులు గెలిచాడు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో నిలబడితే అతడికి విజయావకాశాలు కూడా మెండుగానే ఉంటాయంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తమిళనాట రాఘవ లారెన్స్ ఎవరికి మద్దతుగా నిలుస్తాడని అందరూ ఉత్కంఠగా చూశారు. అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించడం ఆసక్తి రేకెత్తించింది.

తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించి ఆశ్చర్యపరిచిన లారెన్స్.. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులో ఉన్న పన్నీర్‌ సెల్వం ఇంటికి సోమవారం రాత్రి వచ్చాడు. పన్నీర్‌ సెల్వం.. ఇతర అన్నాడీఎంకే నేతలు ఆత్మీయ ఆలింగనాలతో రాఘవ లారెన్స్‌కు స్వాగతం పలికారు. పన్నీర్ సెల్వం పక్కనుండా లారెన్స్ మీడియాతో మాట్లాడాడు. తమిళనాట జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించానని..  అన్నీ ఆలోచించాక పన్నీర్‌ సెల్వంకు మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చానని లారెన్స్‌ తెలిపాడు.

అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లగల సత్తా పన్నీర్ సెల్వంకు మాత్రమే ఉందని లారెన్స్ అన్నాడు. లారెన్స్ కంటే ముందు శరత్ కుమార్ తో పాటు కొందరు సీనియర్ నటులు పన్నీర్ సెల్వంకే మద్దతుగా నిలిచారు. బయటికి చెప్పకపోయినప్పటికీ దాదాపుగా సినీ పరిశ్రమ అంతా పన్నర్ కు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక అందరూ పన్నీర్ వైపుకే వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English