ఓం నమో... ఏడు కోట్లు మాత్రమే

ఓం నమో... ఏడు కోట్లు మాత్రమే

నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ' తొలి వారాంతం దయనీయంగా సాగింది. టాక్‌ బాగున్నప్పటికీ కలక్షన్లు పుంజుకోకపోవడం బయ్యర్లని కలవర పెడుతోంది. మొదటి రోజు అంటే బజ్‌ లేకపోవడంతో వసూళ్లు రాలేదని అనుకున్నారు. టాక్‌ బాగుండడంతో శని, ఆదివారాల్లో బిజినెస్‌ పెరుగుతుందని ఆశించారు. నిజంగానే వసూళ్లు కాస్త పెరిగాయి కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఈ చిత్రం పర్‌ఫార్మ్‌ చేయలేకపోయింది.

తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఏడు కోట్ల షేర్‌ మాత్రమే మొదటి వీకెండ్‌లో రావడంతో ఈ చిత్రం గట్టెక్కుతుందా అనే అనుమానాలు బలపడ్డాయి. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి నిరాదరణ కొనసాగింది. శనివారం కాస్త మెరుగ్గా డెబ్బయ్‌ అయిదు వేల డాలర్లు వసూలయ్యాయి కానీ అది రాబట్టాల్సిన దాంతో పోలిస్తే ఇది ఒక మూలకి కూడా రాదు. ముప్పయ్‌ అయిదు కోట్ల వ్యాపారం జరిగిన సినిమాకి మొదటి వారాంతంలో కనీసం ఇరవై కోట్లయినా వెనక్కి వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని ఆశలు పెట్టుకోవచ్చు.

కానీ ఓం నమో అందులో మూడో వంతు వసూళ్లని కూడా తెచ్చుకోలేదు. వచ్చే వారం భారీ సినిమాలేవీ లేవు కనుక అప్పట్లోగా పుంజుకుని ఒడ్డున పడుతుందనే ఆశ ఒక్కటే బయ్యర్లకి మిణుకు మిణుకుమంటోంది. బ్యాడ్‌ సీజన్‌లో రావడం వల్ల ఎఫెక్ట్‌ పడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాగార్జున రీసెంట్‌ విజయాల వల్ల నిర్మాత ఫుల్‌ సేఫ్‌ కానీ పాపం బయ్యర్లే తమ వెంకటేశ్వరుడే కాపాడాలని లబోదిబోమంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు