రజనీకి ఇది రైట్ టైమా... రాంగ్ టైమా?

రజనీకి ఇది రైట్ టైమా... రాంగ్ టైమా?

తమిళ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం, శశికళలు నేనంటే నేనంటూ సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్న వేళ  ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ... ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా రజనీకాంత్ ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైందన్న ప్రచారం జోరందుకుంది.  రజనీతో ఆరెస్సెస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు.

అయితే.. రజనీ రాజకీయాల్లో దిగే విషయంలో చాలాకాలంగా ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంక్షోభ సమయంలో ఆయన దిగాలని కొందరు అంటుంటే.. అలా చేస్తే ఆయన ఇమేజి మొత్తం డామేజి అవుతుందని.. ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచే రావాలి తప్ప ఇలాంటి సంక్షోభాలను అవకాశాలుగా తీుకుని వస్తే హీరోగా ఆయనకున్న పాపులారిటీ మొత్తం పోతుందని అంటున్నారు.

ఎవరేమి అనుకుంటున్నా రజనీ నుంచి మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ప్రస్తుత రాజకీయంలో రజనీ పేరు మాత్రం  మరింత వేడిని పెంచుతోంది.

మరోవైపు  రజనీకాంత్ కొత్త పార్టీ స్థాపిస్తున్నారని.. బీజేపీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందని వస్తున్న వార్తలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రజనీకాంత్, బీజేపీ మధ్య తాను సయోధ్య కుదురుస్తున్నానంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. బీజేపీతో రజనీకాంత్ చర్చలు జరుపుతున్నారనే వార్తలను నమ్మవద్దని, ఎవరో పనికట్టుకుని ఈ వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English