క‌విత‌క్కా నువ్వు సూపర్

క‌విత‌క్కా నువ్వు సూపర్

ఏపీలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్ల స‌ద‌స్సులో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా భావిస్తున్న కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత స‌ద‌స్సుకు రాగానే ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని చెప్ప‌డంతోపాటు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఏపీకి తాము అండగా ఉంటామని కూడా ప్ర‌క‌టించారు. స‌దస్సుకు వ‌చ్చిన ఆమెతో విలేక‌రులు మాట్లాడ‌గా ఈ విధంగా స్పందించారు. అయితే.. ఇప్ప‌టికే ఏపీలో ప్ర‌త్యేక హోదాపై ర‌గులుతున్న స‌మ‌యంలో ఒక తెలంగాణ ఎంపీగా ఆమె ఏపీలోకి వ‌చ్చి మ‌రీ త‌న మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డిన‌ట్లయింది.

కాగా ఇదే స‌భ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు కుమార్తె దీపా వెంక‌ట్ కూడా పాల్గొంటున్నారు.  ఈ నేప‌థ్యంలో ఈ యువ మ‌హిళా నేత‌లు ఏం మాట్లాడుతారో అన్న ఆస‌క్తి అందరిలో నెల‌కొంది. చంద్ర‌బాబు విధానాల‌ను ఇంత‌కుముందు ప‌లుమార్లు విమ‌ర్శించిన క‌విత ఇప్పుడు సంద‌ర్భోచితంగా ప్ర‌త్యేక హోదాపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో చంద్ర‌బాబు ఇరుకున‌ప‌డిన‌ట్ల‌యింది. విడిపోయిన రాష్ట్రానికి చెందిన కీల‌క నేతే ప్ర‌త్యేక హోదా కోసం ఇంత ప్ర‌స్ఫుటంగా మాట్లాడిన‌ప్పుడు చంద్ర‌బాబు ఎందుకు సైలెంటుగా ఉంటున్నార‌న్న ప్ర‌శ్న మ‌రో మొద‌లైంది.

ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు తీరుపై ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కేంద్రం మెడ‌లు వంచడంలో ఆయ‌న పూర్తిగా విఫ‌ల‌మయ్యార‌ని ప్రతిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో క‌విత వ్యాఖ్య‌లు మ‌రోసారి విప‌క్షాల‌కు చంద్ర‌బాబుపై కొత్త అస్త్రాన్ని అందించిన‌ట్ల‌య్యాయి. క‌విత వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు, చంద్ర‌బాబు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు