మన హీరోకి ట్రంప్ తెగ నచ్చేసాడంట

మన హీరోకి ట్రంప్ తెగ నచ్చేసాడంట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చెబితే చాలామంది అమెరికావాళ్లు కూడా ‘థూ యాక్’ అంటున్నారు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ తనకు ఆదర్శం అంటున్నాడు తెలుగు హీరో నాగార్జున. కాస్త డిఫరెంటుగానే ఉండే నాగార్జున ట్రంప్ విషయంలో మరీ డిఫెరెంటుగా వెళ్తున్నారన్న విమర్శలు వస్తున్నా కూడా ఆయన మాత్రం తన మాటకు కట్టుబడే ఉన్నారు. అయితే... ట్రంప్ ఎందుకు తనకు ఆదర్శమో కూడా నాగార్జున చెప్పారు. ఆయన చెప్పిన విషయం వింటే మాత్రం, నాగార్జున చేసిందానిలో తప్పేమీ లేదని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మంచి ఎవరిలో ఉన్నా స్వీకరించడంలో తప్పు లేదు కదా.

ఇంతకీ.. నాగార్జున ట్రంప్ ను ఎందులో ఆదర్శంగా తీసుకున్నారో తెలుసా.. ? సోషల్ మీడియాలో తన ఒపీనియన్లు వ్యక్తం చేయడంలో ట్రంప్ చాలా క్లియర్ గా ఉంటారు. నాగార్జునకు అది బాగా నచ్చేసింది.  తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించడంలో ట్రంప్ సూపర్ అన్నారు నాగ్.

సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలను ట్రంప్ చాలా చక్కగా చెబుతారని... ఎన్నికల్లో ఆయన గెలవడానికి కూడా ఇదే కారణమని తెలిపారు. ట్రంప్ స్ఫూర్తితోనే తాను కూడా ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యానని చెప్పారు. మన గురించే ఎవరో చెప్పడం కంటే... మన గురించిన సమాచారాన్ని మనమే జనాలతో నేరుగా చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు. నాగ్ తాజా చిత్రం 'ఓ నమో వేంకటేశాయ' ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా ఇక ట్వీట్లతో హోరెత్తిస్తానని ఆయన చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు