ట్రంప్‌ను ఏకిప‌డేసిన ఫేస్ బుక్ ఓన‌ర్‌

ట్రంప్‌ను ఏకిప‌డేసిన ఫేస్ బుక్ ఓన‌ర్‌

ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకని పేర్కొంటూ ఏడు ముస్లిం దేశాల‌కు చెందిన వారికి వీసాల జారీ విష‌యంలో అత్యంత క్లిష్టమైన నిబంధనల ఉత్త‌ర్వుల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంతకం చేయ‌డంపై  ఫేస్ బుక్ సీఈవో మార్క్  జుకర్ బర్గ్ విరుచుకుప‌డ్డారు. వ‌ల‌సదారుల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికాలో ఇలాంటి ప‌రిణామం ఊహించ‌లేద‌ని వ్యాఖ్యానించారు. టెర్రరిస్టుల నుంచి అమెరికా రక్షణ  ముఖ్యమే అయినప్పటికీ ఆపదలో ఉన్నవారికీ, శరణార్థులకు సహాయం చేసేందుకు విశాలంగా వ్యవహరించాలని జుక‌ర్ బ‌ర్గ్ కోరారు.

టెర్ర‌రిస్టుల‌ను అణిచివేయడం మంచిదేన‌ని అయితే ఈ రూపంలో ఆప‌ద‌లో ఉన్నవారికీ, శరణార్థులకు సహాయం చేసేందుకు విశాలంగా వ్యవహరించాలని కోరారు. వారికి సాయపడేందుకు అమెరికా దేశ ద్వారాలు ఎపుడే తెరిచే ఉండాలని జుక‌ర్ బ‌ర్గ్‌ సూచించారు. ఈ మేర‌కు ఫేస్ బుక్ లోని త‌న పేజీలో స‌వివ‌ర‌మైన పోస్ట్ ఒక‌టి పెట్టారు.

ఈ సంద‌ర్భంగా త‌న భార్య చాన్ ప్రిస్కిల్లా ఉదంతాన్ని జుక‌ర్ బ‌ర్గ్ ప్ర‌స్తావించారు. గ‌తంలో వ‌ల‌స‌దారుల విష‌యంలో ఇప్పుడు ఉన్నంత క‌ఠినంగా ఉంటే వియ‌త్నాంకు చెందిన త‌న భార్య కుటుంబ స‌భ్యులు అమెరికా వ‌చ్చేవారు కాద‌ని తెలిపారు. త‌న భార్య విష‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకున్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్ లో అమెరికా అంటే వ‌ల‌స‌దారుల విష‌యంలో క‌ట్ట‌డి చేసే దేశం అనే భావ‌న క‌ల‌గ‌కూడ‌ద‌ని జుక‌ర్ బ‌ర్గ్ సూచించారు. మన చుట్టూ వున్న ప్రపంచం బాగుంటే.. వలసదారులకు మంచి పనిని, జీవనాన్ని  అందివ్వగలిగితే మనకే మంచిదనే భావ‌న‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని జుక‌ర్ బ‌ర్గ్ హిత‌వు ప‌లికారు.  

ప్రపంచంలోని వారందరికీ ఉన్నతమైన స్థానంగా అమెరికాను తీర్చిదిద్దడానికి ధైర్యంగా, సంయమనంగా పనిచేయడానికి ముందుకు రావాలని ఆశించారు. ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, సూడాన్‌, లిబియా, సోమాలియా, యెమెన్ ల నుంచి వ‌చ్చే వారికి నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం 90 వ‌ర‌కు వీసాల జారీని నిలిపివేస్తారు. ఈ పరిణామంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌గా జుక‌ర్ బ‌ర్గ్ ఏకంగా బ‌హిరంగంగా గ‌ళం విప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు