చెన్నైలో 'అమ్మ అల్పాహారం'

చెన్నైలో 'అమ్మ అల్పాహారం'

ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రజల మద్దతు పొందడానికి అధికారంలో ఉండే పార్టీలు చాలా ఎత్తులు వేస్తాయి. ఆ ఎత్తుల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం వినూత్నమైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన 'అమ్మ అల్పాహార' కేంద్రాలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. దాంతో తాజాగా మరో రెండు కొత్త వంటకాలను తక్కువ ధరకే అందించే పథకాన్నిప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.

ప్రస్తుతం ఉదయం, మధ్యాహ్న వేళల్లో మాత్రమే తక్కువ ధరకు అల్పాహార వంటకాలను అందజేస్తుండగా, ఇకపై సాయంత్రం వేళల్లో కూడా అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. రూ.3కే రెండు చపాతీలను అందించబోతున్నార్ట. సెప్టెంబరు ఒకటోతేది నుంచి ఈ పధకం అమలులోకి రానుంది. రూ.5కే తమిళనాడులో ఫేమస్‌ అయిన పొంగల్‌ను కూడా వడ్డించడానికి అల్పాహారకేంద్రాలు సిద్ధమవుతున్నాయి.

అన్ని ధరలూ ఆకాశాన్నంటుతుండగా ఇలాంటి పధకాలు పేదవారి కడుపు నింపుతాయి కాబట్టి ఇది గొప్ప పధకం కిందనే చెప్పవచ్చును. ఈ పధకం ఇంకా మన ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డిగారి దృష్టికి రాలేదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English