పెద్దాయన పెద్దల సభకే

పెద్దాయన పెద్దల సభకే

ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అస్సాం నుంచి మరోసారి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్ళి, ఆ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో అక్కడి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సభ్యులతో సమావేశమయ్యారు. వారితో భేటీ అయ్యాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి నాలుగు సెట్ల పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలపై 40 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇదంతా నామినేషన్‌ తతంగం. రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌, కేంద్ర సహాయ మంత్రి రాణీ నారాహ్‌, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భువనేశ్వర్‌ కలితా, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్‌ ప్రక్రియ ముగియగానే ప్రధాని విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు.

అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహించే రెండు రాజ్యసభ స్థానాల కాలపరిమితి జూన్‌ 14తో ముగియండగా, ఎన్నికలు ఈ నెల 30న జరుగుతాయి. ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి ప్రధాని మన్మోహన్‌ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన అస్సాం నుంచి రాజ్యసభకు పోటీ చేయటం ఇది అయిదోసారి. 1991లో తొలిసారి మన్మోహన్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి తగిన సంఖ్యాబలమున్నందున మన్మోహన్‌ సునాయాసంగా విజయం సాధించడం ఖాయం. రాజ్యసభ పదవి అంటే ప్రజల మద్దతు లేనిదంటారు. ఆ విమర్శ మన్మోహన్‌పై తేలిగ్గానే చేస్తాయి ప్రతిపక్షాలు. కాని రాజ్యసభకు తప్ప లోక్‌సభకు పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోలేకపోతున్నారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English