పేటీఎం బాధిత సంఘం

పేటీఎం బాధిత సంఘం

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో అన్ని కంపెనీల బిజినెస్ ఘోరంగా పడిపోయింది. కానీ పేటీఎం బిజినెస్ మాత్రం ఊహించని విధంగా పెరిగింది. ఏకంగా వందలరెట్లు ఆదాయం సమకూరింది. అందరూ పేటీఎం బాట పట్టడంతో.. పేటీఎం పండగ చేసింది. కానీ వినియోగదారులు మాత్రం లబోదిబోమంటున్నారు.

కరెన్సీకి కొరత ఎదురైనప్పుడు.. పేటీఎం బాగా ఉపయోగకరమని చాలా మంది భావించారు. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచైనా డబ్బులు పంపే వెసులుబాటు ఉండటంతో.. అందరూ పేటీఎం అకౌంట్ కు డబ్బులు పంపుకున్నారు. కానీ బ్యాంక్ నుంచి డబ్బులు డెబిట్ అయిన మెసేజ్ వచ్చినా.. పేటీఎం మాత్రం స్పందించడం లేదు.

ఓరోజు, వారం కాదు నెల రోజులు ఎదురుచూసినా కూడా పేటీఎం నుంచి సమాధానం లేదు. తమ బ్యాంకు నుంచి డెబిట్ అయిన నగదు పేటీఎం ఖాతాలో ఎందుకు చూపించడం లేదన్న వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం లేదు . రాదు. దీంతో పేటీఎం బాధితులు కోర్టుకెక్కేందుకు రెడీ అయ్యారు.

దేశంలో ఆన్ లైన్ లావాదేవీలు ఎంత భద్రంగా ఉన్నాయో ఈ విషయం తేటతెల్లం చేస్తోంది. కేంద్రం ఊకదంపుడు ప్రచారం పక్కనపెడితే.. వాస్తవంగా దేశంలో ఆన్ లైన్ వ్యవహారాలన్నింటిలోకీ హ్యాకర్లు చొరబడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని సర్వేల్లో తేలింది. ఇప్పటికైనా పేటీఎం మోజులో నుంచి బయటపడాలని దేశప్రజలకు సూచిస్తున్నారు బాధితులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు