జైట్లీకి ఎటకారం ఎక్కువైంది.

జైట్లీకి ఎటకారం ఎక్కువైంది.

ఆయన దేశానికి ఆర్థిక మంత్రి. డీమానిటైజేషన్ ను పర్యవేక్షించాల్సిన వ్యక్తి. కానీ నోట్ల రద్దు జరిగినన్నాళ్లూ ఏనాడూ మీడియా ముందుకు రాని జైట్లీ.. ఇప్పుడు మాత్రం అడపాదడపా పెద్దనోట్ల రద్దు, జమలపై మాట్లాడుతున్నారు. మొత్తం 97 శాతం పాతనోట్లు జమయ్యాయన్న మీడియా కథనాలపై స్పందించారు జైట్లీ.

డిసెంబర్ 30నాటికి 12.5 లక్షల కోట్లు జమ అయినట్లు చెబుతున్నారు. కానీ బ్యాంకులు కూడా లెక్క పూర్తిచేయాలన్నారు జైట్లీ. కౌంటింగ్ తప్పులు రాకుండా చూడాలన్నారు. ఇప్పుడు నీతులు చెబుతున్న జైట్లీ.. అసలు నోట్ల రద్దు సమయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు జనం.

ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దుపై ప్రకటనలు చేస్తుంటే.. జైట్లీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శలు వచ్చాయి. ఇక మరికొందరైతే అసలు పెద్దనోట్ల రద్దు నిర్ణయం జైట్లీకి తెలియదని పార్లమెంటు సాక్షిగా చెప్పారు.

అసలు ఎన్ని పెద్దనోట్లు జమయ్యాయనే విషయం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక మంత్రిది. కానీ ఆయన ఆ విషయం మాట్లాడలేదు. పైగా మీడియా కథనాల్లో వచ్చాయా.. నాకు తెలియదంటూ వెటకారం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. జైట్లీ ఇప్పటికైనా బాధ్యతగా మాట్లాడాలంటున్నారు విమర్శకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు