కోహ్లీ, అనుష్క ఫైర్

 కోహ్లీ, అనుష్క ఫైర్

బెంగళూరు ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అసలు ఇంత జరుగుతుంటే.. చూస్తూ కూర్చున్న వాళ్లని మనుషులనాలా.. పిరికిపందలనాలా అని మండిపడ్డాడు కోహ్లీ. పాడుపని జరుగుతుంటే అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండటం సరికాదన్నాడు.

ఇంత జరుగుతుంటే చూస్తున్నవాళ్లని మనుషులనాలా అని ప్రశ్నించిన కోహ్లీ.. ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టం అని చెబుతున్నాడు. దుస్తుల విషయంలో కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశాడు. అధికారంలో ఉన్నవాళ్లు కూడా దీన్ని సమర్థించడం ఘోరమంటున్నాడు కోహ్లీ.

గుంపులో ఉన్న మహిళల్ని వేధిస్తారు. చుట్టూ ఉన్న వాళ్లు చూసి ఊరుకుంటారు. మానవత్వం లేని మనుషులు దుస్తులు, వేళల గురించి మాట్లాడతారని విరుచుకుపడింది కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ. సమాజంలో ఆడవారి హక్కుల్ని కాపాడటంలో ఘోరంగా విఫలమౌతున్నామంటోంది.

టైమ్ దొరికితే చాలు బిజీబిజీగా జంటగా డిన్నర్లు, డేట్లు, పార్టీలకు వెళ్లే కోహ్లీ, అనుష్క ఇప్పుడు బెంగళూరు ఘటనపై  స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలకు సామాజిక స్పృహ ఉందని నిరూపిస్తున్నారు. మహిళల్ని గౌరవించడం పిల్లలకు ఇంటినుంచే నేర్పాలని అనుష్క ట్వీట్ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు