ఆ రహస్యమేంటి చంద్రబాబూ..?

ఆ రహస్యమేంటి చంద్రబాబూ..?

ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఇది అన్ని పార్టీలకూ తెలుసు. అందుకే విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టు చేర్చారు. కానీ విభజన జరిగిపోయాక పోలవరం గురించి ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఏపీకి హోదా కావాలని అందరూ పోరాడటంతో.. కేంద్రం దిగొచ్చి పోలవరానికి నాబార్డు రుణం ఇప్పించింది.

ప్రస్తుతం తొలివిడతగా సుమారు 2వేల కోట్ల రూపాయలిచ్చింది.  ఈమాత్రం దానికే సీఎం చంద్రబాబు ఎక్కడలేని ఆర్భాటం చేస్తున్నారనేది కాంగ్రెస్ నేత ఉండవల్లి విమర్శ. 30వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పోలవరానికి.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమూలకు చాలవని మండిపడుతున్నారాయన.

తాను రాజీ పడకపోతే.. పోలవరం ప్రాజెక్టుకు నిధులొచ్చేయి కాదంటున్న చంద్రబాబు.. ఏవిషయంలో రాజీపడ్డారో ఆ రహస్యం జనానికి చెప్పాలని ఉండవల్లి సవాల్ విసిరారు. ఓవైపు పోలవరం పూర్తిచేస్తానంటూ.. మరోవైపు పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎందుకని ప్రశ్నించారు.

పట్టిసీమ పేరుతో పదహారు వందల కోట్లు సముద్రంలో కలిపిన చంద్రబాబు.. ఇప్పుడు పురుషోత్తమపట్నం పేరుతో అదే పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం కుడికాల్వకు ఇచ్చిన పరిహారం పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు ఉండవల్లి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు