టీ అసెంబ్లీలో బాలయ్య.. ఇంటికెళ్లిన కేసీఆర్

టీ అసెంబ్లీలో బాలయ్య.. ఇంటికెళ్లిన కేసీఆర్

నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామం ఎదురైందా? అంటే అవుననే చెప్పాలి. తన వందో చిత్రమైన గౌతమీ పుత్ర శాతకర్ణి స్పెషల్ షోకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించటానికి తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు.

ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునే సమయానికి కేసీఆర్ అసెంబ్లీలోనే ఉన్నారు.ఇదే సమయంలో ఊహించని విధంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

కారు దిగి తనను ఆహ్వానించటానికి వచ్చిన వారిని పలుకరిస్తూ బాలకృష్ణ తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష భవనంలోకి వెళ్లారు. కాసేపు అక్కడే గడిపారు. ఇక.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఆయన బయలుదేరే సమయానికి.. కేసీఆర్ ఇంటికి వెళ్లిపోయిన సమాచారాన్ని అందుకున్నారు. దీంతో.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తీసుకొని ముఖ్యమంత్రి అధికారనివాసమైన ప్రగతి భవన్ కు వెళ్లారు.

అసెంబ్లీకి వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆహ్వానం అందించటానికే అయినప్పడు.. నేరుగా తన వద్దకు రాకుండా పార్టీ కార్యాలయానికి బాలయ్య వెళ్లటం కేసీఆర్ కాస్త చిన్నబుచ్చుకొని ఉంటారని.. అందుకే తన దారిన తాను ఇంటికి వెళ్లినట్లుగా పలువురు చెబుతున్నారు.  ఇందులో నిజానిజాలు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు