వాజ్ పేయ్ పై అద్వానీ కుట్ర చేశారట?

వాజ్ పేయ్ పై అద్వానీ కుట్ర చేశారట?

ప్రముఖ వ్యక్తులు.. సీనియర్ జర్నలిస్టులు.. అధికారులు ఈ మధ్యన పుస్తకాలు రాస్తున్నారు. ఇలా రాసిన ప్రతిసారీ కొన్ని కొత్త విషయాలు.. అప్పటివరకూ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన అంశాలు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. లక్క.. బంగారంగా చెప్పుకునే ఆప్తమిత్రులు మాజీ ప్రధాని వాజ్ పేయ్.. మాజీ ఉప ప్రధాని అద్వానీ మధ్యన జరిగిన ఆసక్తికర ఉదంతాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్ తాజాగా రాసిన "ది అన్ టోల్డ్ వాజయ్ పేయి; పొలిటియన్ అండ్ పారడాక్స్" పుస్తకంలో వెల్లడించారు.

ప్రధానిగా వాజ్ పేయ్ ఉన్న సమయంలో ఆయన్ను పదవి నుంచి దింపే ప్రయత్నాన్ని అద్వానీని ప్రధానిగా చేయాలన్న ప్రయత్నం జరిగిందని.. ఆ కుట్రకు సంబంధించిన ఉదంతాన్ని తన తాజా పుస్తకంలో పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.  ఉప ప్రధానిగా అద్వానీబాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ కుట్ర జరిగిందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఒక రోజు ఒక మంత్రిని తన నివాసానికి పిలిపించుకున్న ప్రధాని వాజ్ పేయ్.. తనకు అందించిన కుట్ర సమాచారాన్ని సదరు మంత్రికి వివరించినట్లు వెల్లడించారు.

అయితే.. అందుకు ఆ మంత్రి స్పందిస్తూ.. దానికి అంతగా భయపడాల్సిందేమీ లేదని చెప్పగా.. తాను ఈ కుట్రను నమ్ముతున్నట్లుగా వాజ్ పేయ్ పేర్కొన్నట్లు చెప్పారు. తనకు సమాచారం వచ్చిన కుట్ర వెనుక ఎవరు ఉన్నారని పేర్కొన్న విషయాన్ని ఆరా తీసేందుకు వాజ్ పేయ్ ప్రయత్నించినట్లుగా ఉల్లేఖ్  రాశారు. ఈ ఉదంతానికి ముందు.. వాజ్ పేయ్ కి రాష్ట్రపతి బాధ్యతలు అప్పజెప్పి.. ప్రధానిగా అద్వానీని చేయాలన్న సూచనను సంఘ్ చెప్పడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరీ.. కొత్త విషయంపై బీజేపీ కురువృద్ధుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు