ఆ ధిక్కారం.. వైకాపాకు గుణపాఠం

ఆ ధిక్కారం.. వైకాపాకు గుణపాఠం

‘యథా పితృ: తథా పుత్రిక:’  అని మనం కొత్త సామెత తయారుచేసి చెప్పుకోవాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన ఆరు సంవత్సరాల పాలనలో.. ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చేయడంలో చాలా సమర్థంగా సక్సెస్‌ అయ్యారు. ప్రజలు ఎవ్వరూ కూడా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడడం అనే ఆలోచన చేయకుండా, ప్రభుత్వం ఎప్పుడు తమవైపు ఎంగిలిచేయి విదిలిస్తుందా ఆ నాలుగు మెతుకులు ఏరుకుని తిందామా అని ప్రజలు ఎదురుచూసేలా వారిని నిస్తేజంగా తయారు చేయడంలో ఆయన సక్సీడ్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన తనయ షర్మిల కూడా అదే తరహాలో ఉద్యోగులను బిచ్చగాళ్లుగా ఎంచి.. వారికి తాయిలాలు విదిలించి.. వారిలో తన పట్ల భక్తిని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నది.

షర్మిల తన యాత్రలో మాట్లాడుతూ సీమాంధ్ర వ్యాప్తంగా ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే జీతాలతో పాటూ.. ఒక నెల జీతం బోనస్‌ గా కూడా ఇస్తారని ప్రకటించారు. సర్కారు సొమ్మును తాయిలంగా ప్రకటించేసి.. ఉద్యోగులను టోకుగా తమ తమ ‘సంక్షేమ భావజాలానికి’ భక్తులుగా ఆ ముసుగులో  బానిసలుగా కొనుక్కునే ప్రయత్నం ఇదన్నమాట.

అయితే ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్‌బాబు షర్మిల ప్రతిపాదన పట్ల చాలా అద్భుతంగా స్పందించారు. షర్మిల ప్రకటించిన బోనస్‌ తమ ఉద్యోగులకు అక్కర్లేదని ఆయన అన్నారు. బోనస్‌ అని ప్రకటించడం అంటేనే విభజనను అంగీకరించడం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటున్నట్లు ప్రకటన వచ్చే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లోను ఉద్యమం ఆపేది లేదని చెప్పారు. అలా ఆయన షర్మిల ప్రతిపాదన పట్ల తన ధిక్కారాన్ని చాలా స్పష్టంగా స్థిరంగా ప్రకటించి ఉద్యోగ వర్గాల గౌరవాన్ని నిలబెట్టారు.

ఇక్కడ మరో విషయం గమనించాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చేయడం ద్వారా.. తన దోపిడీ పట్ల రాష్ట్రాన్ని టోకుగా విక్రయించేయడం పట్ల జనం దృష్టి మరలకుండా చేశారు. ఇప్పుడు షర్మిల కూడా.. తన అన్నయ్య బోనస్‌ ఇస్తాడు అని చెప్పడం ద్వారా తమ దోపిడీలపై వారు దృష్టిపెట్టకుండా ఉండేలా ప్లాన్‌ చేసి ఉన్నట్లయితే గనుక.. అశోక్‌బాబు ఆమెకు గట్టి గుణపాఠం చెప్పినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు