ఎంసెట్ కు మంగళం పాడనున్న ఏపీ

ఎంసెట్ కు మంగళం పాడనున్న ఏపీ

ఉమ్మడి ఏపీలో బాగా పాపులరైన ఎంసెట్ ఇక తెరమరుగు కానుంది. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఇంజినీరింగ్ కాలేజీలకు.. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు మాత్రం పెరగడం లేదు. పైగా కాలేజీల్లో నాణ్యత లేక ఏపీ విద్యార్థులంతా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు.

ఏటా ఇంజినీరింగ్ సీట్లు పెరుగుతుండగా.. ఇటు ఉత్తీర్ణులౌతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వందలాది సీట్లు మిగిలిపోతున్నాయి. అలాంటప్పుడు ఎంసెట్ ఎందుకనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎలాగో మెడిసిన్ కు నీట్ రాస్తున్నారు కాబట్టి ఎంసెట్ రద్దు చేసే దిశగా ఏపీ ఆలోచిస్తోంది.

ఎంసెట్ రద్దుపై నిర్ణయానికి ముందు అధ్యయన కమిటీ వేయనున్నారు. ఒకటి రోజుల్లో కమిటీపై అధికారిక ప్రకటన రానుంది. ఎంసెట్ అవసరమా.. శాస్త్రీయత ఎంత, ఎంసెట్ రాయకపోతే నష్టమేంటి. ఇంటర్ మార్కులు వెయిటేజీగా పనికిరావా.. వంటి అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది.

అయితే ఇంటర్ మార్కుల్ని పరిగణనలోకి తీసుకునేటప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతో పాటు గ్రామీణ, నగర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని డిమాండ్లున్నాయి. ఎంసెట్ పరీక్ష పెట్టడానికి ఈ భేదాలు కూడా కారణం. కాబట్టి ఎంసెట్ రద్దు చేస్తే.. గ్రామీణ విద్యార్థుల కోసం ఏం చేయాలనేది కీలకంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు