వెన్నుపోటు భయంతోనే లోకేష్ దూరం

వెన్నుపోటు భయంతోనే లోకేష్ దూరం

చంద్రబాబు లోకేష్ కు క్యాబినెట్ పదవి ఇస్తే ఏడాదిగా ప్రచారం జరుగుతున్నా.. ఇంతవరకూ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దీనికి టీడీపీ నేతలు, క్యాబినెట్ మంత్రులు రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. అటు చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు.

కానీ వైసీపీ నేత రోజా ఇప్పుడు లోకేష్ ను క్యాబినెట్ లోకి ఎందుకు తీసుకోవడం లేదో కొత్త కారణం చెప్పి కలకలం రేపారు. యూపీలో అంతఃపుర కుట్ర చూసి చంద్రబాబుకు బీపీ పెరిగిపోయిందని రోజా ఎద్దేవా చేస్తున్నారు. రోజా కామెంట్స్ తో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ములాయం తనయుడు అఖిలేష్ ను సీఎం చేస్తే.. చివరకు ములాయంను పార్టీ జాతీయ అధ్యక్షుడిగానే తొలగించారు. అలాంటప్పుడు ఇక్కడ లోకేష్ కు క్యాబినెట్ పదవి ఇస్తే.. తన మనుగడే కష్టమౌతుందని చంద్రబాబు భయపడుతున్నారని రోజా మండిపడుతున్నారు.

అయితే రోజా విమర్శలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే ములాయం ఎపిసోడ్ ఇప్పుడే తెరపైకి వచ్చిందని, కానీ లోకేష్ కు క్యాబినెట్ పదవి ఎప్పట్నుంచో నానుతుందని గుర్తుచేశారు. ఇప్పుడు రోజా వ్యాఖ్యలతో మరోసారి లోకేష్ కు పదవి హాట్ టాపిక్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు