హోట‌ల్లు, రెస్టారెంట్ల‌కు షాక్ లాంటి వార్త ఇది

హోట‌ల్లు, రెస్టారెంట్ల‌కు షాక్ లాంటి వార్త ఇది

హోట‌ల్లు, రెస్టారెంట్ల‌కు షాక్ లాంటి వార్త ఇది. సాధార‌ణంగా మ‌నం హోట‌ల్‌కు వెళ్లినా, రెస్టారెంట్‌కు వెళ్లినా, మ‌న ప్ర‌మేయం లేకుండానే బిల్‌పై స‌ర్వీస్ ఛార్జ్ వేస్తారు. స‌ర్వీస్ స‌రిగా లేకున్నా క‌స్ట‌మ‌ర్ ఆ చార్జ్‌ను చ‌చ్చిన‌ట్లు కట్టాల్సిందే. సాధార‌ణంగా బిల్లుపై అయిదు నుంచి 20 శాతం వ‌ర‌కు స‌ర్వీస్ ఛార్జ్‌ను వ‌సూల్ చేస్తారు. అయితే ఈ ప‌ద్ధ‌తిని త‌ప్పుప‌ట్టిన కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తెస్తోంది. కేంద్ర వినియోగ‌దారుల శాఖ దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది.

కేంద్ర‌ ఆహార‌, వినియోగ‌దారుల‌ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తాజాగా ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు. బిల్‌పై ఆటోమెటిక్‌గా స‌ర్వీస్ చార్జ్ వ‌సూలు చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం అని  పేర్కొన్నారు. స్వ‌చ్ఛ‌మైన వాణిజ్య విధానానికి అది విరుద్ధ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఉన్న ప‌న్నులకు అధ‌నంగా రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జీని వ‌సూలు చేస్తున్నాయ‌ని, స‌ర్వీస్ ఛార్జ్ అనేది ఐచ్ఛికంగా ఉండాల‌ని, స‌ర్వీస్ ఛార్జ్ క‌ట్టాలా వ‌ద్దా అన్న నిర్ణ‌యం వినియోగ‌దారునికే ఉంటుంద‌ని రామ్ విలాస్ పాశ్వాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో తెలిపారు. కేంద్ర మంత్రి చేసిన ట్వీట్‌కు హోట‌ల్ సంఘం కూడా మ‌ద్ద‌తు తెలిపింది.

క‌స్ట‌మ‌ర్ త‌న‌కు న‌చ్చితేనే సేవా ప‌న్ను చెల్లించ్చ‌వ‌చ్చు అని పేర్కొంది. రెస్టారెంట్ల‌కు, హోట‌ళ్ల‌కు కొత్త విధానంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేంద్రం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించింది. సో ఇక నుంచి మీకు న‌చ్చిన ఫుడ్ వ‌డ్డిస్తేనే మీరు స‌ర్వీస్ చార్జ్ చెల్లించాల‌న్న మాట‌.

Photo Gallery:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English