2017లో ఫ్లైట్ ఎక్కితే 2016లో అడుగుపెట్టారట!

2017లో ఫ్లైట్ ఎక్కితే 2016లో అడుగుపెట్టారట!

టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతుందో ఈ సంఘటన రుజువు చేసింది. ఇప్పటిదాకా కాలంతో మనం ప్రయాణం చేయాల్సిందే గానీ.. వెనక్కి వెళ్లలేమని అనుకునేవాళ్లం. కానీ అది నిజం కాదని న్యూఇయర్ వేడుకల సాక్షిగా  విమాన ప్రయాణికులు రుజువుచేశారు. రెండుసార్లు న్యూఇయర్ వేడుకలు జరుపుకుని రికార్డు సృష్టించారు.

సాధారణంగా మనం ప్రయాణం చేసేటప్పుడు కాలం ముందుకు జరుగుతుందా.. వెనక్కి జరుగుతుందా. అదేంటి అలా అడిగారు. ముందుకే జరుగుతుంది అనుకుంటున్నారా. కానీ ఇక్కడ అలా జరగలేదు. 2017లో ఫ్లైట్ ఎక్కితే 2016లో అడుగుపెట్టారట.

చైనా నుంచి అమెరికా వెళ్లిన విమాన ప్రయాణికులు రెండుసార్లు న్యూఇయర్ వేడుకలు జరుపుకుని కొత్త రికార్డు సృష్టించారు. చైనా షాంఘై నుంచి అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు మొత్తం 16 గంటలు సమయంలో తేడా ఉంటుంది. కానీ ప్రయాణ సమయం మాత్రం 11 గంటల 5 నిమిషాలే.

మొదట షాంఘైలో న్యూఇయర్ వేడుకలు జరుపుకున్న తర్వాత.. విమానం ఎక్కి.. శాన్ ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టారు. అప్పుడక్కడ పాత సంవత్సరమే కాబట్టి కొద్ది గంటల్లో మరోసారి న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ విమాన ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు