టీడీపీ ఎమ్మెల్యే రికార్డింగ్ డ్యాన్స్

టీడీపీ ఎమ్మెల్యే రికార్డింగ్ డ్యాన్స్

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావు సందడి చేశారు. ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొనడం మంచిదే అయినా.. ఆయన రికార్డింగు డ్యాన్సులు చేసేవారితో కలిసి డ్యాన్సులు వేయడమే విమర్శలకు దారితీస్తోంది.

 న్యూఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్లో అమ్మాయితో కలిసి చిందేశారు. అమ్మాయిలు స్టేజ్ మీద ఉండడంతో స్టెప్పులు అదరగొట్టేందుకు వారితో ఆయన పోటీ పడ్డారు. పంచె పైకి కట్టి లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్సు అంటూ చిందులేశారు. ఎమ్మెల్యే బాబురావుతో పాటు లోకల్ టీడీపీ నాయకులు స్టేజ్ మీద హల్ చల్ చేశారు.

 వయసు మీద పడుతున్నా తమలో ఘాటు మాత్రం తగ్గలేదని చాటుకునేందుకు ఎమ్మెల్యే, టీడీపీ నేతలు కాళ్లు కీళ్లు, చేతులు, నడుమును వీలైనంత వేగంగా కదిలించేందుకు ట్రై చేశారు. మొత్తం మీద రికార్డింగ్ డ్యాన్స్లో అందమైన అమ్మాయిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బాబురావు చేసిన డ్యాన్సు ఎలా ఉందన్నది పక్కనపెడితే ఆయన తీరు మాత్రం విమర్శలకు దారితీస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు