అంతా మీ ఇష్టమేనా..?

అంతా మీ ఇష్టమేనా..?

కేంద్రం దేశప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. డీమానిటైజేషన్ తో విసిగి వేసారిపోయిన జనానికి తీపికబురు చెప్పింది. జనవరి 1 నుంచి ఏటీఎంలలో 2500కు బదులుగా 4500 తీసుకోవచ్చని చెప్పింది. దీంతో హమ్మయ్య ఇక మనీ కష్టాలు కాస్తైనా తీరతాయని సామాన్యులు ఆనందపడ్డారు.

కానీ బ్యాంకర్లు మాత్రం బాథపడ్డారు. అసలు తమను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి కేంద్రానికి లెటర్ పెట్టారు. ఇప్పుడు ఉన్న లిమిట్ కే చస్తుంటే.. కొత్తగా లిమిట్ పెంచితే ఎలాగని మొత్తుకుంటున్నారు.

కేంద్రం, ఆర్బీఐ చెప్పినట్లుగా నగదు సరఫరా మెరుగుపడలేదని, ఇప్పుడు లిమిట్ పెంచితే తాము ఏటీఎంలలో సర్దుబాటు చేయలేమని బ్యాంకులు చెబుతున్నాయి. సరిపడనంత నగదు ఇచ్చాక మొత్తం ఆంక్షలన్నీ ఎత్తేసినా ఇబ్బందిలేదని చెప్పాయట బ్యాంకులు.

కానీ అసలు ఏటీఎంలు ఎక్కడ పనిచేస్తున్నాయని సామాన్యులకు డౌటొస్తోంది. ఇప్పటికే ఎక్కడా ఏటీఎంలు పనిచేయడం లేదు. అలాంటప్పుడు ఏటీఎం లిమిట్ పెంచితే ఏంటి.. పెంచకపోతే ఏంటి అని లైట్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లో విత్ డ్రా చేసుకునే లిమిట్ పెంచాలని కోరుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు