అనగనగా ఓ వీరుడు జానారెడ్డి

అనగనగా ఓ వీరుడు జానారెడ్డి

అదేంటి అనుకుంటున్నారా. అదంతే. ఇప్పుడు అసెంబ్లీలో జానా చాలా సైలంట్ గా ఉంటున్నారు. ఒకప్పుుడు ఎన్టీఆర్ టైమ్ లో టీడీపీలో ఉన్నప్పుడు మంచి అగ్రెస్సివ్ గా ఉండేవాళ్లట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారా. ఎవరో ఎందుకు చెబుతారండీ. జానాయే చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ మీటింగ్ ముగిశాక.. కేసీఆర్, జానారెడ్డి కలిసి గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ముందుగా కేసీఆర్ చెబుతూ.. పాత రోజుల్లో అందరూ టీడీపీలో ఉన్నప్పుడు రోజూ ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవాళ్లమని గుర్తుచేశారు. అంతే జానా ఊరుకుంటారా.. తన వీరగాథ వినిపించారు.

ఎన్టీఆర్ టైమ్ లో జానారెడ్డి, కేసీఆర్, అశోక్ గజపతిరాజు టీడీపీలోనే ఉండేవాళ్లు. రోజూ ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవాళ్లు. ఒకసారి అశోక్ గజపతిరాజు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. కాంగ్రెస్ వాళ్లు మీదకొచ్చారట. దీంతో జానా గన్ తీసి వాళ్లను బెదిరించి అశోక్ ను కాపాడారట.

జానారెడ్డి చెప్పిన స్టోరీ విన్నవాళ్లకు అనుమానం వచ్చింది. నిజంగా జానారెడ్డి అంత వీరుడైతే.. అసెంబ్లీలో కేసీఆర్ తోకలాగా ఎందుకుంటున్నారు అని. కానీ అప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు వేరు అని జానారెడ్డి చెప్పకనే చెప్పేశారు తాను కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నానని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English