వాళ్లంతా దొంగలేనా..?

వాళ్లంతా దొంగలేనా..?

అయిపోయింది. అంతా అయిపోయింది. కేంద్రం అనుకున్నంత పనీ జరిగింది. వేట మొదలవక ముందే కొంతమంది దొరకిపోయారు. ఏకంగా ఏడు లక్షల కోట్లు జమ చేసిన అరవై లక్షల మందిపై ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ ఖాతాలన్నీ స్కాన్ చేస్తోంది.

అంతమంది ఊహించనంత పెద్దమొత్తం జమ చేశారంటే తప్పకుండా అవకతవకలు జరిగి ఉంటాయని ఆర్బీఐ అనుమానిస్తోంది. నీతి, నిజాయితీగా డబ్బు సంపాదిస్తే అంత తక్కువ మంది.. ఇంత ఎక్కువ డబ్బు కూడబెట్టే అవకాశం లేదంటోంది. ఇప్పుడు వీళ్ల జాతకాలు తిరగేసే పనిలో పడింది.

రెండు లక్షల కన్నా ఎక్కువ జమ చేసిన వాళ్లు మొత్తం 60 లక్షల మంది లెక్క తేలారు. అందరూ కాకపోయినా... వీళ్లలో మెజార్టీ పీపుల్ నల్లధనవంతులేనని చెబుతున్నారు బ్యాంకర్లు. భారీగా జమ చేసిన వాళ్లు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉన్నారు.

ఇప్పటిదాకా ఇళ్లలో మూలుగుతున్న లక్షల కోట్లు ఇప్పుడు బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చేశాయి. దీంతో పెద్ద మొత్తంలో పన్ను వేయడానికి కేంద్రానికి ఛాన్స్ వచ్చింది. తేడా వస్తే ఎక్కువ పన్ను వేయడమే కాదు.. దొంగల్ని అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు