అమ్మకు రీపోస్ట్ మార్టమ్..?

అమ్మకు రీపోస్ట్ మార్టమ్..?

సంచలనాల అమ్మ.. తన అంతిమ ఘడియలకు సంబంధించిన అనుమానాలకు మద్రాస్ హైకోర్టు రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. అపోలో ఆసుపత్రిలో అమ్మకు చేసిన చికిత్స.. ఆమె మృతిపైనా పలు సందేహాలు ఉన్నాయంటూ మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై ఈ రోజు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ఈ పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. తాను వ్యక్తిగతంగా జయలలిత మృతిపై సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జయలలిత మృతిపై ఉన్నసందేహాల్ని తొలగించేందుకు ఆమె మృతదేహానికి మరోసారి రీపోస్ట్ మార్టమ్ ఎందుకు చేయించకూడదంటూ కొత్త వాదనను తెరను తీసుకొచ్చారు.

జస్టిస్ వైద్యానాథన్ చేసిన వ్యాఖ్యలు అటు అన్నాడీఎంకే నేతలు మొదలు.. సాదాసీదా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమ్మ భౌతికకాయానికి రీపోస్ట్ మార్టర్ చేస్తారా? అన్నది ఇప్పుడు కొత్త ప్రశ్నగా మారింది. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అమ్మ చేపట్టిన తర్వాత.. చిన్నమ్మకు అధికారికంగా బదిలీ అయిన రోజునే న్యాయమూర్తి నోటి నుంచి 'అనుమానాస్పద' వ్యాఖ్యలు రావటం విశేషం. మరి..అమ్మ మృతదేహానికి మరోసారి రీపోస్ట్ మార్టమ్ తప్పదా? అన్నది కాలమే తేల్చాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు