దళితుడు కాబట్టే తొక్కేశారు

దళితుడు కాబట్టే తొక్కేశారు

క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఇది ఆయన ప్రమేయం లేకుండానే జరిగింది. బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ దళితుల పేరుతో నిప్పు రాజేశారు. కాంబ్లీ దళితుడు కాబట్టే క్రికెట్లో కనుమరుగయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఉదిత్ రాజ్ కామెంట్స్ పై బీజేపీలో దుమారం రేగింది. మొన్నటిదాకా రోహిత్ వేముల ఆత్మహత్యతో.. ప్రతిపక్షాలన్నీ బీజేపీని దళిత ద్రోహ పార్టీగా ముద్రేశాయని, ఇప్పుడు ఉదిత్ రాజ్ అనవసరంగా దళిత తేనెతుట్టెను కెలుకుతున్నాడని కమలనాథులు తలపట్టుకుంటున్నారు.

 అయితే కాంబ్లీ మాత్రం ఉదిత్ రాజ్ విమర్శల్ని కొట్టిపారేశారు. తానలా అనుకోవడం లేదన్న కాంబ్లీ.. తన కెరీర్ గురించి ఇతరులెవరూ అంత పట్టించుకోవాల్సిన పనిలేదని హితవు పలికారు. ఎవరి పని వారు చూసుకుంటే బెటరని చురకంటించారు.

 మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఉదిత్ రాజ్ పై సెటైర్లు పడుతున్నాయి. ఉదిత్ రాజ్ కావాలనే దళిత్ కార్డ్ ఉపయోగిస్తున్నారని, ఆయనకు మతి భ్రమించిందని కామెంట్లు పడ్డాయి. మొత్తం మీద ఉదిత్ రాజ్ పబ్లిసిటీ కోసమే కాంబ్లీని వాడాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు