పాత నోట్లు ఉంటే.. జైలుకే

పాత నోట్లు ఉంటే.. జైలుకే

పెద్దనోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు.. ఇప్పుడు మరో కొత్త సంచలనానికి తెరతీస్తోంది. పాత నోట్లు కలిగి ఉన్న వాళ్లను జైలుకు పంపాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కాస్త గడువుంది లెండి. మార్చి 31 డెడ్ లైన్ పెట్టింది.

 ఇప్పటికే మార్చి 31 లోపు ఆర్బీఐ ఆఫీసుల్లో పాతనోట్లు జమ చేయొచ్చని ఆఫర్ ఇచ్చిన కేంద్రం.. ఆ డెడ్ లైన్ దాటితే అంతేనని హెచ్చరిస్తోంది. విషయమేమిటంటే పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం అంచనాలు పూర్తిస్థాయిలో నిజం కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు.
 పాతనోట్లపై కొత్త ఆర్డినెన్స్ తేవాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. మార్చి 31 తర్వాత పాతనోట్లు కలిగి ఉన్నవాళ్లకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించబోతున్నారు. ఇక డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు చేస్తే.. ఐదువేలు జరిమానా విధించే ఆలోచన కూడా ఉంది.

నల్లధనం పోవాలంటే.. పాతనోట్లు పోవాలంటున్న మోడీ.. ఆదిశగానే అడుగులేస్తున్నారు. ఆశించినంత పాతనోట్లు బ్యాంకులో జమ కాలేదని, అంటే అవి ఇంకా బ్లాక్ మనీగానే ఉండిపోయాయని కేంద్రం అనుమానిస్తోంది. ఈ ఆర్డినెన్స్ తో చచ్చినట్లు పాతనోట్లు ఎక్కడున్నా అవే బ్యాంకులకు వస్తాయని భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు