మంత్రి పదవి కోసం మైత్రి కాదు

మంత్రి పదవి కోసం మైత్రి కాదు

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటిదాకా టీడీపీ, బీజేపీ ఓ జట్టుగా ఉన్నాయి. కానీ ఈసారి అసెంబ్లీ వింటర్ సెషన్లో సీన్ రివర్సైంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే.. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.

ఈ సీన్ చూసిన తెలంగాణ జనాలందరికీ ఆశ్చర్యం, అనుమానం ఒకేసారి కలిగాయి. మోడీ లేదు.. గీడీ లేడు అని తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు మోడీని తెగపొగిడేస్తున్నారు. అంటే ఇద్దరి మధ్య శత్రుత్వం కాస్తా మైత్రిగా మారిందన్న మాటేగా.

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ప్రధాని ఊరికే నిర్ణయం తీసుకోరని, ఏదో అర్థం, పరమార్థం ఉంటుందని మోడీకి ఎక్కడలేని మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా అసెంబ్లీలో టీఆర్ఎస్ అధినేత మనసెరిగి నడుచుకుంటున్నారు.

ఇప్పుడు పెద్దనోట్ల రద్దును కేసీఆర్ సమర్థించడం వెనుక కూడా.. ఎప్పట్నుంచో నలుగుతున్న అంశమే కారణమనే వాదన వినిపిస్తోంది. అదే కేసీఆర్ కూతురు కవితకు మంత్రి పదవి. కానీ కవిత మాత్రం ఈ వాదన కొట్టిపారేస్తున్నారు. తనకు మంత్రి పదవి కోసం కేంద్రంతో మంచిగా ఉండటం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చామంటున్నారు కవిత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు