కొత్తొక వింత.. పాతొక జాతా

కొత్తొక వింత.. పాతొక జాతా

జాతా అంటే జాతర. మామూలుగా అయితే కొత్తొక వింత.. పాతొక రోతే. కానీ పాత నోట్ల విషయంలో మాత్రం ఈ సామెత వర్తించదు. ఎందుకంటే కొత్త నోట్లకు ఎంత డిమాండ్ ఉందో.. పాతనోట్లకు కూడా అంతే డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త నోట్ల కంటే పాతవే మంచి బిజినెస్ చేస్తున్నాయి. నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించి పెడుతున్నాయి.

ఈ పాతనోట్ల బాగోతం కోల్ కతాలో మొదలైంది. మొన్నటిదాకా జనాన్ని పీడించి నోట్ల మార్పిడికి కమిషన్లు తీసుకున్న దళారులు.. ఇప్పుడు డబ్బులు ఎదురిచ్చి మరీ పాతనోట్లు తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడే ఉంది షెల్ కంపెనీల రహస్యం. షెల్ కంపెనీలకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంచుకునే వెసులుబాటు ఉంది.

ఆ వెసులుబాటుతో ఐటీ శాఖను బురిడీ కొట్టించడానికి షెల్ కంపెనీలు మాస్టర్ ప్లాన్ వేశాయి. ఆ ప్లాన్ లో భాగంగానే జనానికి ఎక్కువ డబ్బులిచ్చి మరీ పాతనోట్లు తీసుకుంటున్నాయి. అలా చేసి ట్యాక్స్ ఎగ్గొట్టాలని షెల్ ప్లాన్ అన్నమాట.

ఇంతకూ జనానికి ఎంత ముడుతోందంటే.. 500 రూపాయల నోటిస్తే.. 550, వెయ్యి రూపాయల నోటిస్తే.. 1100 వస్తోంది. దీంతో కొంతమంది బడాబాబులు కూడా తమ దగ్గరున్న బ్లాక్ మనీ ఈ రకంగా ఎక్కువ వైటైపోతుందని సంబరపడుతున్నారు. అటు సామాన్యులు కూడా బ్యాంక్ కంటే ఇదే బెటరని ఫిక్సైపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English