చెక్కు చెల్లకపోతే.. జైలు కెళ్లాల్సిందే

చెక్కు చెల్లకపోతే.. జైలు కెళ్లాల్సిందే

చెక్ బౌన్స్ అయితే ఏమౌతుంది. మహా అయితే కేసు పెడతారు. బెయిల్ తెచ్చుకుంటారు. దర్జాగా తిరుగుతారు. కేసు తేలేలోపు ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ ఇప్పట్నుంచీ అలా కుదరదు. బౌన్స్ చెక్ ఇస్తే జైలు కెళ్లాల్సిందేనంటోంది కేంద్రం.

అందుకు అనుగుణంగా ప్రస్తుత చట్టంలో మార్పులు తెస్తుంది. కొత్త చట్టం ప్రకారం చెక్ బౌన్స్ అయితే.. రెండు పార్టీలకు నెల రోజులు గడువిస్తారు. ఈలోగా సమస్య పరిష్కరించుకుంటే సరే. అయినా చెక్ క్యాష్ కాకపోతే.. బెనిఫీషియరీకి చెక్ ఇచ్చినవాళ్లను జైలుకు పంపొచ్చు.

కేవలం చెక్ బౌన్స్ కేసులే దేశవ్యాప్తంగా 18 లక్షలు పెండింగ్ లో ఉండటంతో.. కేంద్రం వీటిపై దృష్టి సారించింది. ఇంత చిన్న విషయానికి కూడా ఏళ్ల తరబడి విచారణ అవసరం లేదని భావిస్తున్న కేంద్రం.. చట్టం మారుస్తోంది. పైగా క్యాష్ లెస్ ఇండియాలో చెక్కులకే ప్రాధాన్యత ఉంది కాబట్టి..ముందుగానే కఠిన చట్టం తెస్తోంది.

అన్నీ అనుకూలిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త చట్టం పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే చెక్కు ఇచ్చినవారికి కాకుండా చెక్కు తీసుకున్నవారికి ప్రయోజనం ఉండేలా కొన్ని నిబంధనలు మార్చిన కేంద్రం.. ఇప్పుడు చెక్కు తీసుకున్నవాళ్లకే మొత్తం ప్రయోజనం కట్టబెట్టే విధంగా చట్టంలో మార్పులు చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు