ఆ సినిమాలేంటి..? ఆ భాషేంటి..?

ఆ సినిమాలేంటి..? ఆ భాషేంటి..?

తెలుగు సినిమాలో రోజురోజుకీ విలువలు తరిగిపోతున్నాయంటున్నారు ఓ సీనియర్ నటి. గతంలో హీరోయిన్ గా చేసిన జీవిత.. ఇప్పుడు సినిమా డైలాగులు చూస్తుంటే.. ఏమనాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఆహుతి, అంకుశం లాంటి సినిమాల్లో జీవించిన జీవిత.. ఇప్పటి డైలాగుల గురించి మాడ్లాడటంలో అర్థముందనే అనిపిస్తోంది.

 కొన్నాళ్ల క్రితం ఓ స్టార్ హీరో సినిమా రిలీజైంది. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ తో చెప్పే డైలాగ్ కొంతమంది సదరు హీరో ఫ్యాన్స్ కే నచ్చలేదు. మనోడు ఏంటి ఇలాంటి డైలాగ్ చెప్పాడని మనసులో అనుకున్నారు. కాకపోతే అభిమానం కాబట్టి పైకి అనలేదు. ఇప్పుడు జీవిత వాటినే ఎత్తిచూపుతున్నారు.

 కుక్కలు క్రాసింగ్ కు వచ్చాయి. హెల్ప్ చేస్తారా అని హీరోయిన్ అడుగుతుంది. కుక్కల క్రాసింగ్ గురించి మాట్లాడుతున్నారు కానీ.. మేం క్రాసింగ్ వచ్చి చాన్నాళ్లైంది. మమ్మల్నీ పట్టించుకోండని హీరో తనలో తాను అనుకుంటాడు. ఈ సీన్ ఎంత వల్గర్ గా ఉందో చూసినోళ్లందరికీ తెలుసు. కానీ స్టార్ మేనియాతో సినిమా ఆడేసింది.

 అసలు కుక్కల క్రాసింగ్ ను ఇంత నీచమైన అర్థం వచ్చేలా ఓ గొప్ప హీరోతో ఎలా డైలాగ్ చెప్పిస్తారని జీవిత ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో విలువల్లేవనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇలాంటి డైలాగులు స్టార్ హీరోలు చెబితే.. ఇక యువతరం ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు జీవిత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు