వాడకంలో ఈయన తర్వాతే ఎవరైనా...

వాడకంలో ఈయన తర్వాతే ఎవరైనా...

ఇదీ వాడకమంటే. ఊరకే గొప్పలు చెబుతారు కానీ.. ఎవరూ ఈ స్థాయిలో పక్కవాళ్లను వాడలేరండీ. అసలు నోట్ల మార్పిడి కోసం ఏకంగా 700 మందిని వాడాలంటే.. ఎంత కష్టం చెప్పండి. నలుగురు కూలీల్ని మెయిన్ టైన్ చేయడానికే రైతు ఆపసోపాలు పడతాడు. కానీ ఈ వ్యాపారి మాత్రం చాలా సింపుల్ గా ఇంతమందినీ వాడేశాడు.

ఇటీవలే సూరత్ లో ఓ వడ్డీ వ్యాపారి ఐటీ వలలో పడ్డాడు. కేవలం టీ స్టాల్ ఓనర్ గా అందరికీ తెలిసిన కిశోర్ భాజీవాలా.. ఆస్తులు విని అప్పట్లోనే అందరికీ కళ్లు తిరిగాయి. ఇప్పుడు తవ్విన కొద్దీ ఈయన గారి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా 700 మందిని నోట్ల మార్పిడి కోసం వినియోగించినట్లు తెలిసి ఐటీ అధికారులే నోరెళ్లబెట్టారు.

పెద్ద నోట్ల రద్దుతో హెవీ క్యాష్ పార్టీలకు చేతులు కట్టేసినట్లైంది. అందుకే ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు మార్పిడి చేసుకున్నారు. కిషోర్ కూడా అదే పని చేశాడు. కానీ ఏ పదిమందినో, ఇరవై మందినో కాకుండా.. ఏకంగా 700 మందితో పనికానిచ్చాడు.వీళ్లందర్నీ వాడి డబ్బులు డిపాజిట్, విత్ డ్రా చేయించాడు.

బ్లాక్ మనీ దాయడానికి 27 బ్యాంక్ ఖాతాలు వాడాడు కిశోర్. ఇందులో 20 బినామీ అకౌంట్లే. ఈయనగారి మొత్తం ఆస్తి 400 కోట్లు. ఐటీకి దొరికింది పది కోట్లు. అసలు ఇన్ని లావాదేవీలు ఒకే వ్యక్తి ఎలా చేశాడనే డౌటొచ్చింది కదూ. వస్తుంది. ఇక్కడ సూరత్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ హ్యాండుంది లెండి. అందుకే ఈ ఫీట్ సాధ్యమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English