జియో ఫ్రీ ఆఫర్ ఎప్పటివరకు..?

జియో ఫ్రీ ఆఫర్ ఎప్పటివరకు..?

ఎయిర్ టెల్ జియో పేరెత్తితేనే మండిపడుతోంది. ఎలాగైనా జియో ఫ్రీ ఆఫర్ ను అడ్డుకోవాలని కంకణం కట్టుకుంది. తన బిజినెస్ తగ్గిపోయినా పర్లేదు కానీ.. జియో మాత్రం బిజినెస్ పెంచుకోకూడదని పావులు కదుపుతోంది. ఏకంగా ట్రాయ్ మీదే కంప్లైంట్ ఇచ్చేసింది.

దేశీయ టెలికాం మార్కెట్లో ఎయిర్ టెల్ మార్కెట్ లీడర్. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఎయిర్ టెల్ ఏకఛత్రాధిపత్యానికి జియో రాకతో గండిపడింది. షార్ట్ టైమ్ లో జియోకు రికార్డు స్థాయిలో కస్టమర్లు వచ్చారు. ఏకంగా క్యూల్లో నిలబడి మరీ జియో సిమ్ తీసుకోవడాన్ని దేశమంతా వింతగా చెప్పుకున్నారు.

ఇప్పటిదాకా డిసెంబర్ 31 వరకు ఫ్రీ ఆఫర్ ఇచ్చిన జియో.. న్యూ ఇయర్ ఆఫర్ అంటూ కొన్నాళ్ల క్రితమే మార్చి 31వరకు ఉచిత సేవలు పొడిగించింది. అయితే దీనికి ట్రాయ్ కూడా తల ఊపడం ఎయిర్ టెల్ కు కోపం తెప్పించింది. అసలు మొదటిసారే ఫ్రీ వద్దంటే.. మళ్లీ మళ్లీ ఏంటని ఫైరైపోయింది.

ట్రాయ్ తో లాభం లేదని టెలికామ్ డిస్ ప్యూట్స్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఫ్రీ ఆఫర్ కు అనుమతి ఇవ్వకూడదని వాదించింది. ట్రిబ్యునల్ కూడా ఫ్రీ ఆఫర్ కు అనుమతి విషయం పునరాలోచించాలని కోరడంతో.. జియో యూజర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు