దేశంలో నోట్ల కొరత.. గుజరాత్ లో నోట్ల వర్షం

దేశంలో నోట్ల కొరత.. గుజరాత్ లో నోట్ల వర్షం

వ్యాపారులంతా అక్కడే ఉంటారు. అంతేనా. కాదు కాదు. ఇంకా చాలా ఉంది. అసలు గుజరాతీయుల రక్తంలోనే వ్యాపారం ఉంది.
    
ఎస్. ఇదీ సరైన పాయింట్. గుజరాతీల రక్తంలో బిజినెస్ ఉంది. అందుకే దేశంలో ఏ మూల చూసినా గుజరాతీ బిజినెస్ మేన్ హవా కనిపిస్తోంది. గుజరాత్ లో ఉద్యోగాలు చేసేవాళ్ల కంటే వ్యాపారులు చేసేవాళ్లకే డిమాండ్ ఎక్కువ. అలాంటి చోట డబ్బుకు లేటేముంది చెప్పండి.
    
సాధారణ రోజుల్లోనే కాదు.. దేశంలో నగదు కష్టాలు ఉన్న సమయంలో కూడా గుజరాత్ లో మాత్రం ఫుల్ క్యాష్ ఉంది. ఎంతగా అంటే గానా బజానాలో సింగర్స్ పై నోట్ల వర్షం కురిపించేంతగా. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. పోవాల్సిందే మరి. ఎందుకుంటే ఎంతైనా ఇది గుజరాత్ వింత కదా.

విషయమేమిటంటే గుజరాత్ నవ్ సేరిలో ఓ భజన కార్యక్రమం జరిగింది. కానీ సింగర్స్ ఆలపించిన మాటలకు మైమరిచిపోయిన శ్రోతలు.. రెచ్చిపోయి డాన్స్ చేశారు. అంతేనా అంతటితో ఆగకుండా సింగర్స్ పై పది, ఇరవై నోట్లు విసిరారు. ఆ ఏముందిలే అనుకుంటున్నారా. విసిరిన నోట్ల విలువ ఏకంగా 40 లక్షలు. ఇప్పుడిదే దేశంలో హాట్ టాపిక్. అసలు వీళ్ల దగ్గరకు అన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయో మనకు అర్థం కాదు లెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు