ఫ్యాన్స్ మాటలతో హర్టైంది

ఫ్యాన్స్ మాటలతో హర్టైంది

బాలీవుడ్ బెబో కరీనాకపూర్ తన ముద్దుల తనయుడికి తైమూర్ అలీ ఖాన్ పటౌడీ అని పేరు పెట్టింది. తన కొడుకు పేరు తైమూర్ అని ఇలా ట్వీట్ పెట్టిందో లేదో.. సోషల్ మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. మన దేశంపై దండెత్తిన విదేశీ పాలకుడి పేరు పెట్టడమేమిటని శాపనార్థాలు పెట్టారు.

అయితే అభిమానుల వ్యాఖ్యలపై కరీనా కపూర్ బాబాయ్ రిషికపూర్ మండిపడ్డారు. వాళ్ల కొడుక్కి ఏం పేరు పెట్టుకుంటే మీ కెందుకని నిలదీశారు. అసలు ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే మందు సంస్కారం ఉండాలని క్లాస్ పీకారు. మీ కొడుకుల పేర్లు ఇలా ఎందుకు పెట్టారని అడిగితే ఏం చేస్తారని మండిపడ్డారు.

అటు బెబో కూడా ఫ్యాన్స్ మాటలతో హర్టైంది. అందుకే తన కొడుకు పేరు తన ఇష్టమంటోంది. మరోవైపు ఇదే సందర్భమని చెప్పి.. కొంతమంది చరిత్ర పుస్తకాలు తిరగేస్తున్నారు. అసలు తైమూర్ కథేంటని చదువుతున్నారు. పోనీలే ఇలాగైనా తైమూర్ కథ అందరూ తెలుసుకుంటున్నారని చరిత్రకారులు సంతోషిస్తున్నారు.

అసలు విషయమేమిటంటే ఆసియాలో చంఘిజ్ ఖాన్ తర్వాత గొప్ప పాలకుడు తైమూర్. తైమూర్ ఒక్కడే కాదు మధ్యయుగం నాటి పాలకులంతా విదేశాలపై దండయాత్రలు చేసినవారే. మరో ట్విస్టేంటంటే.. తైమూర్ చిన్న కొడుకు పేరు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ . ఇక ఇప్పుడు ఆ పేరుమీదా గోల షురూ అవుతుందేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English