పాపాలు చేశాక.. పశ్చాత్తాపం

పాపాలు చేశాక.. పశ్చాత్తాపం

ఖైదీలకు జైలుశిక్ష వేసేది కేవలం శిక్ష కోసమే కాదు.. వాళ్లలో పరివర్తన రావడం కోసం. ఇప్పుడు షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి ఇంద్రాణిలో కూడా మార్పు కనిపిస్తోంది. తన ఆస్తితో పాటు అవయవాల్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
         
కన్న కూతురినే చంపిన కసాయి అని అందరితో తిట్టించుకున్నారు. చివరకు అయినవాళ్లు, స్నేహితులు కూడా అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. కట్టుకున్న భర్త కూడా జైలుకు వెళ్లేసరికే.. తప్పంతా తనపైనే నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూసి ఇంద్రాణిలో వైరాగ్యం పెరిగిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
      
ఇప్పటికే భగవద్గీత శ్లోకాలను ఇంగ్లీష్ లోకి అనువదిస్తున్న ఇంద్రాణి.. ఇప్పుడు ఆస్తి, అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకోవడం కలకలం రేపుతోంది. తన ఆస్తిలో 75 శాతం దానం చేస్తానని కోర్టు సాక్షిగా జడ్జికి చెప్పారు. ఇంద్రాణి చెప్పింది విని.. ఆమె తరపున వాదిస్తున్న లాయర్లు కూడా ఆశ్చర్యపోయారు.
     
జైల్లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఇంద్రాణి.. తోటి ఖైదీల కష్టాలు చూసి చలించిపోయాయనని చెప్పారు. అయితే విరాళం ఇవ్వడానికి కోర్టు అనుమతి అవసరం లేదని జడ్జి చెప్పారు. ఇంద్రాణి ఇచ్చే విరాళంలో సగం ఇస్కాన్ కు, మిగతా సగం స్త్రీ, బాలల సంక్షేమ సంస్థకు వెళుతుంది. ఇంద్రాణి అవయాలు దానం చేసినా.. ఆమె భర్త పీటర్ మాత్రం అవయవదానానికి నిరాకరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు