పాస్ పోర్ట్.. ఫోటో తీసుకున్నంత ఈజీ

పాస్ పోర్ట్.. ఫోటో తీసుకున్నంత ఈజీ

దేశంలో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటేనే నానాపాట్లు పడాలి. ఇక పాస్ పోర్ట్ రావాలంటే వేరే చెప్పాలా. ఎక్కడ లేని కష్టాలు పడాల్సిందే. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పుణ్యమా అని పాస్ పోర్ట్ పొందే సమయం తగ్గినా.. కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇకపై పాస్ పోర్ట్ ధృవీకరణల కోసం కష్టపడక్కర్లేదని కేంద్రం తీపికబురు చెప్పింది.
      
పాస్ పోర్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే.. ఇప్పటివరకూ కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇకపై రూల్స్ సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సులభంగా పాస్ పోర్ట్ పొందే అవకాశం కల్పించింది. పుట్టినతేదీ, పెళ్లి ధృవీకరణ పత్రాల్లేకపోయినా.. ఇకపై పాస్ పోర్ట్ పొందవచ్చు.
       
ఇప్పటివరకూ బర్త్ సర్టిఫికెట్ లేకపోతే పాస్ పోర్ట్ వచ్చే ఛాన్సే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇతర ఐడీ కార్డులపై ఉన్నా.. అవి చెల్లవు. ఇక జీవిత భాగస్వామికి పాస్ పోర్ట్ రావాలన్నా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. లేదంటే పాస్ పోర్ట్ రాదు. ఇప్పటివరకూ ఇదే సీన్.
        
కానీ ఇకపై సీన్ మారనుంది. పుట్టిన తేదీ గొడవకు చెల్లుచీటీ ఇచ్చేసినట్లే. బర్త్ సర్ట్ ఫికెట్ లేకపోయినా.. మార్క్స్ లిస్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బీమా పాలసీ ఇలా ఎందులో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరిపోతుది. అలాగే తండ్రి పేరు రాయాలన్న నిబంధన ఎత్తేశారు. సన్యాసులైతే తల్లీ, తండ్రీ పేరు రాయకుండా.. గురువు పేరు రాసే వీలు కూడా కల్పించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు