ఇకపై జాగ్రత్తగా ఉంటానండీ

ఇకపై జాగ్రత్తగా ఉంటానండీ

మొదటి సినిమా 'జోష్‌' ఇవ్వకపోయినా కానీ 'ఏమాయ చేసావె', '100% లవ్‌' చిత్రాలతో నాగచైతన్య సక్సెస్‌ అయ్యాడు. అయితే మాస్‌ హీరో అయిపోవాలనే ప్రయత్నంలో వెంటనే భంగపడ్డాడు. దడ, బెజవాడ సినిమాలు అతడిని కోలుకోలేని దెబ్బ తీశాయి.

ఆ చిత్రాలు చేయడం పొరపాటేనని ఇకపై అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటానని చైతన్య చెప్తున్నాడు. తడాఖాతో మళ్లీ నిలదొక్కుకున్న చైతన్య ఇకపై లవర్‌బాయ్‌ వేషాలకి దూరంగా ఉంటానని అంటున్నాడు. మాస్‌ హీరోలకే కెరీర్‌ పరంగా ఎక్కువ కాల పరిమితి ఉంటుందనేది నిజమే అయినా కానీ చైతన్య ప్రస్తుతం మాస్‌ సినిమాల కంటే రొమాంటిక్‌ చిత్రాలకే సూట్‌ అయ్యేలా ఉన్నాడు. ఇది ఇతర మాస్‌ హీరోలకి లేని అడ్వాంటేజ్‌. పైగా అక్కినేని హీరోలకి ఉన్నది కూడా రొమాంటిక్‌ హీరోలనే ఇమేజే కాబట్టి చైతన్య అందుకు లోబడి ఉండడం తప్పేమీ కాదు.

ఇకపై జాగ్రత్తగా ఉంటానని అంటూనే ఇలాంటి రాంగ్‌ డెసిషన్‌ తీసుకోవడం మాత్రం చిత్రంగా ఉంది. ఈ విషయంలో నాగార్జున ఓసారి బ్రెయిన్‌ వాష్‌ చేస్తే మంచిదేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English