ఏటీఎం... ఎక్కువ తీస్తే మోతే?

ఏటీఎం... ఎక్కువ తీస్తే మోతే?

ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో రొజుకో కొత్త రూలొస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఎప్పుడు ఏ డెసిషన్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఏటీఎంల నుంచి తీసుకొనే డబ్బుపై ఛార్జీల భారం పడొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దుతో ప్రజలను క్రమంగా 'క్యాష్‌లెస్' వైపు మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రం ఈ దిశగా మరో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే 0.5-2 శాతంతో సర్ చార్జి విధించాలని భావిస్తోంది. ఈ నెల 30 తర్వాత నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. అయితే కనీస పరిమితికి మించి నగదు డ్రాచేసే వారికే ఈ సర్‌చార్జ్ విధించనున్నట్టు సమాచారం. అయితే ఆ పరిమితి ఎంతన్న విషయంపై ప్రస్తుతానికి  స్పష్టత లేదు. అయితే అది బ్యాంకుల నుంచి అయితే రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి అయితే రోజుకు రూ.15 వేలకు మించి డ్రా చేస్తే నిర్వహణ వ్యయం పేరుతో సర్ చార్జి విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్రం దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిందని..   సర్ చార్జి నిబంధనను 4 నుంచి 6 నెలలు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నారని ఢిల్లీ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.  అయితే.. ఇది ఆర్నెళ్ల తరువాత కూడా కొనసాగించే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు