సమంత కోసం చైతూ ఏడ్చిన వేళ..

సమంత కోసం చైతూ ఏడ్చిన వేళ..

సమంత కోసం చైతూ ఏడవడం అంటే.. అదేదో సినిమాల్లో అనుకునేరు. నిజ జీవితంలోనే చైతూ సమంత కోసం ఏడ్చేశాడట. ఆ ఆసక్తికర సంఘటన గురించి అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ ఛాట్ సందర్భంగా వెల్లడించింది సమంత.

ఇది సమంత నటించిన తమిళ సినిమా 'తెరి' కి సంబంధించిన విషయం. ఆ సినిమాలో సమంత పాత్ర కీలకం. కథ మలుపు తిరిగేది ఆమె పాత్ర వల్లే. హీరో మీద పగ సాధించడానికి విలన్లు అతణ్ని కాల్చేసి.. సమంతను కూడా చంపేస్తారు. చనిపోయే సీన్లో సమంత పెర్ఫామెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది.

ఆ సన్నివేశం చూసి సామాన్య ప్రేక్షకులతో పాటు చైతూ కూడా ఏడ్చేశాడని.. అది చూసి తాను కూడా ఎమోషనల్ అయిపోయానని వెల్లడించింది సమంత. మామూలుగా చైతూ చాలా కూల్‌గా కనిపిస్తాడు. కూల్‌గా మాట్లాడతాడు. అలాంటివాడు సమంత పాత్ర చనిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడంటే ఆశ్చర్యమే.

దీన్ని బట్టే సమంత మీద చైతూకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఎంత నటన అయినా.. సినిమాలో పాత్ర చనిపోతుంటే వారి కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయిపోవడం మామూలే. 'గమ్యం' సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం చూసి.. అతడి తల్లి చాలా బాధపడి మళ్లీ అలా చనిపోయే పాత్ర చేయొద్దని ఖరాఖండిగా చెప్పేశారు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు