కొడుకు సాప్ట్ వేర్.. తండ్రి కూలీ

కొడుకు సాప్ట్ వేర్.. తండ్రి కూలీ

బతుకు బండిని నడిపేది పచ్చనోటే. అది లేకపోతే ఏమున్నా లేనట్లే. ఎవరు కష్టపడినా పొట్టకూటి కోసమే. కష్టాలు ఉన్నప్పుడు కూలీ పనికి వెళ్ళక తప్పదు. కానీ ఈ తండ్రి మాత్రం కొడుక్కి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా తన పని వదలనంటున్నాడు. ఆత్మగౌరవంతోనే బతుకుతానని చెప్పి.. సమాజానికి ఆధర్శంగా నిలుస్తున్నాడు.
       
కొడుక్కి చిన్న ఉద్యోగం వస్తేనే.. వీళ్లేదో సాధించినట్లు కొండెక్కి కూర్చునే తండ్రులున్న ఈ కాలంలో.. రాజస్థాన్ లోని తేజారామ్ ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈయన రోజువారీ కూలీ. కొడుకును ఉన్నత చదువులు చదివించడానికి అందిన కాడికి అప్పులు చేశాడు, కొడుకు ప్రయోజకుడై అప్పులు తీర్చినా.. తాను మాత్రం కూలికే వెళ్తున్నాడు.
   
తేజారామ్ కొడుకు రామచంద్ర ఐఐటీలో ఇంజినీరింగ్ చేసి,.. ప్రతిష్ఠాత్మక గూగుల్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని, కొద్ది కాలంలోనే అప్పులు తీర్చేసి. తమ ఊళ్లో తండ్రికి సౌకర్యంగా కొంత స్థలం కొన్నాడు. కానీ ఏం చేసినా తేజారామ్ కూలీ పని మాన్పించలేకపోయాడు.
         
అదేమంటే తేజారామ్ చెప్పిన సమాధానం అందర్నీ కదిలిస్తోంది. కొడుకుని ప్రయోజకుడ్ని చేయడం తండ్రి బాధ్యత. అంత మాత్రాన కొడుకు పంపించే డబ్బుతో సుఖపడిపోవాలని ఎక్కడా లేదని, తనకు ఓపికున్నంతవరకూ కష్టపడతానని, తర్వాత ఎలాగో కొడుకు మీద ఆధారపడక తప్పదని తేజారామ్ చెబుతున్నాడు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English