అమ్మ లేదు.. నిదుర రాదు

అమ్మ లేదు.. నిదుర రాదు

జయ లేని తమిళనాడు బిక్కుబిక్కుమంటోంది. తమను కన్నతల్లి కంటే మిన్నగా చూసిన జయ ఇకలేదని జనం తల్లడిల్లుతుంటే.. కొండంత అండగా ఉన్న అమ్మ లేకపోవడం వల్లే దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని అన్నాడీఎంకే నేతలు భోరుమంటున్నారు. తమిళనాట ఐటీ దాడులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
    
జయలలిత ఉన్నంత కాలం తమిళనాడులో కేంద్రపెద్దలు ఎవరు రావాలన్నా అమ్మ పర్మిషన్ కావాల్సిందే. ఆమెను ధిక్కరించే ఏమైనా చేసే సీన్ మోడీకి లేదు. కానీ ఆమె ఆస్పత్రిలో చేరడం ఆలస్యం.. కేంద్రం అడ్వాంటేజ్ తీసుకుంది. అన్నాడీఎంకే నేతలే టార్గెట్ గా ఐటీ దాడులు చేయిస్తోంది.
      
జయ మరణం తర్వాత రెండుగా చీలిన అన్నాడీఎంకేని మోడీ ఇంకా ఇబ్బందిపెడుతున్నారు. అటు పన్నీర్, ఇటు శశికళ ఏ వర్గాన్నీ వదలకుండా ఐటీతో సహా ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నారు. వార్థా తుపాను నుంచి ఇఫ్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడులో.. ఐటీ తుపాను ప్రకంపనలు సృష్టిస్తోంది.
    
ఐటీ దాడులు అన్నాడీఎంకేతో ఆగవని, తమపై కూడా పడతారేమోనని డీఎంకే నేతలు తెగ భయపడుతున్నారు. అవినీతి ప్రధాన ఆయుధంగా ఎన్నికల్లో నెగ్గిన బీజేపీ.. ఇప్పుడు తమిళనాడులో కూడా ఉన్న పార్టీలపై అవినీతి ముద్రవేసి.. తనకు గ్యాప్ సృష్టించుకోవాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం జయ బతికి ఉంటే.. కేంద్రానికి ఇంత ధైర్యం మాత్రం అస్సలు ఉండేది కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English