ఈ మెట్రోకి ఏమయింది?

ఈ మెట్రోకి ఏమయింది?

హైదరాబాద్ కే తలమానికంగా అందరూ అనుకున్న మెట్రో ప్రాజెక్ట్.. మూడడుగులు ముందుకు ఆరడగులు వెనక్కు అన్న చందంగా నడుస్తోంది. అసలు సూపర్ ఫాస్ట్ గా పిల్లర్లు లేపిన ఎల్ అండ్ టీ తర్వాత పని మాత్రం నత్తనడకన చేస్తోంది. హైదరాబాద్ లో ఏదో తవ్వకాల్లో బయటపడిన పురాతన నగరంలా తయారైంది. నగరం అందమంతా పోయి.. ఎక్కడా చూసినా సగం లేపిన స్తంభాలే కనిపిస్తున్నాయి.
       
మెట్రోకి ప్రభుత్వం పెట్టిన గడువు ఒకటి. ఎల్ అండ్ టీ చెప్పిన గడువు మరొకటి. సరే మధ్యలో చాలాసార్లు గడువు మారింది. కానీ ఇంతవరకూ ఎల్ అండ్ టీ చెప్పిన టైమ్ కు పని పూర్తిచేయలేకపోతోంది. అదేమంటే ట్రాఫిక్, కోర్టు కేసులు. ఇతర అడ్డంకులు అని కుంటిసాకులు చెబుతోంది. అటు సర్కారు కూడా స్పీడ్ గా పూర్తిచేసే విధంగా చొరవ తీసుకోవడం లేదు.
     
ఓవైపు మెట్రో స్తంబాల కారణంగా ట్రాఫిక్ జామ్ లు తప్పక వాహనదారులు అవస్థ పడుతున్నారు. మరోవైపు అకారణ జాప్యంతో మెట్రో ప్రాజెక్ట్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు ఖర్చు రెట్టింపైంది. ఇంకా చాలా ఖర్చుపెట్టాల్సి ఉంది. కానీ మెట్రో పనుల నత్తనడక చూసి ఎవరూ నిధులివ్వడం లేదు.
     
మొదట్లో మెట్రో ప్రాజెక్టుకు ఉత్సాహంగా నిధులిచ్చిన బ్యాంకులు కూడా ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. దీనికి కారణం మీరంటే మీరని ఎల్ అంట్ డీ , హెచ్ఎంఆర్ నిందించుకుంటున్నాయి. జరుగుతున్న పని కంటే.. వీళ్లిద్దరి పంచాయితీకే కాలహరణం జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు