టీట్వంటీలో ప్రపంచ రికార్డు!

టీట్వంటీలో ప్రపంచ రికార్డు!

ఇండియాకు ఐపీఎల్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్. మరి న్యూజిలాండ్ తక్కువ తిందా.. అందుకే సూపర్ స్మాష్. ఏంటివన్నీ అనుకుంటున్నారు. దేశవాళీ టీట్వంటీలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిట్టవడంతో.. అన్నిదేశాలు దేశవాళీ లీగ్ లు మొదలుపెట్టాయి. మొదట ఆసీస్ బిగ్ బాష్ టోర్నీ ప్రవేశపెట్టి విజయవంతమైంది.
   
ఆసీస్ కు అతి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ కూడా దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్ ను ప్రవేశపెట్టింది. హార్డ్ హిట్టర్లను జాతీయ జట్టులోకి తేవడానికి ఈ సూపర్ స్మాష్ టోర్నీ బాగా పనికొస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ టోర్నీలో బౌలర్లను బ్యాట్స్ మెన్ స్మాష్ చేస్తున్నారు. కానీ ఇప్పుడీ ఈ స్మాష్ కూడా తారాస్థాయికి చేరింది.
      
ఏకంగా 40 ఓవర్లలో 497 పరుగులు నమోదవడంతో.. టీట్వంటీలో ప్రపంచ రికార్డు నమోదైంది. సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్స్, ఒటాగో టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ స్మాషింగ్ రికార్డు నమోదైంది. దీంతో గత ఆగస్ట్ లో టీమిండియా, కరీబియన్ టీమ్స్ మధ్య మ్యాచ్ లో నమోదైన 489 పరుగుల రికార్డు చెరిగిపోయింది.
         
ముందుగా బ్యాటింగ్ చేసిన ఒటాగో టీమ్.. 20ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హామిష్ రూథర్ ఫర్డ్ 50 బంతుల్లోనే 106 పరుగులతో మెరుపు సెంచరీ బాదాడు. కిచెన్ కూడా 33 బంతుల్లో 54 పరుగులుతో స్మాష్ హాఫ్ సెంరీ చేశాడు. తర్వాత సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు చేసి తృటిలో గెలుపు చేజార్చుకుంది. మహేల జయవర్థన్ మెరుపు సెంచరీ చేస్తే.. టామ్ ట్రూస్.. 29 బంతుల్లోనే 61 పరుగులతో చెలరేగాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు