ఆమె ఆర్మీ అంటేనే వణికిచస్తున్నారు

ఆమె ఆర్మీ అంటేనే వణికిచస్తున్నారు

ఐఎస్ ఉగ్రవాదులకు ఎవరెంటో భయమో తెలుసా. తెలుసు అల్లా తప్ప ఇంకెవరన్నా వారికి భయం లేదనుకుంటున్నారా . కాదు వారు భయపడేవారు ఈ భూమ్మీదే ఒకరున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడో, రష్యా అధ్యక్షుడో వారిని భయపెట్టడం లేదు. ఏ అబల ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకున్న ఓ అమ్మాయి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇరాన్ లో పుట్టి డెన్మార్క్ లో శరణార్థిగా బతుకుతున్న జోన్న పలని.. సిరియాలో ఐసిస్ దారుణాలు విని చలించిపోయింది. అందుకే డెన్మార్క్ లో మంచి జీవితాన్ని వదిలేసి.. కుర్దుల ఆర్మీలో చేరింది. అప్పట్నుంచి ఐసిస్ కు నిద్ర కరువైంది. ఐసిస్ కు అందరూ చేసిన నష్టం కంటే జోన్నా చేసిన నష్టమే ఎక్కువంటేనే ఆమె వీరత్వం ఏంటో అర్థమవుతోంది.

ఐసిస్ ఉగ్రమూకల్ని ఎలా ఎదిరించాలో మహిళలకు నేర్పిన జోన్న.. వారిని చంపడం చాలా తేలికని చెబుతోంది. జోన్న మాటలు విని మొదట్లో లైట్ తీసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు.. ఆమె దాడులు చూశాక మనసు మార్చుకున్నారు. అప్పట్నుంచి జోన్న సేన వస్తుందంటే.. విపరీతంగా భయపడిపోతున్నారు. అమెరికన్ ఆర్మీ కంటే జోన్న ఆర్మీ అంటేనే వణికిచస్తున్నారు.

జోన్న పుట్టుకే పోరాట నేపథ్యం ఉన్న కుటుంబంలో జరిగింది. ఆమె తాతలు కుర్దు పోరాట యోధులు, గల్ఫ్ వార్ సమయంలో పుట్టిన జోన్న.. చిన్ననాటి నుంచి డెన్మార్క్ శరణార్థిగానే ఉంది. అయితే సిరియాలో పోరాడి డెన్మార్క్ వచ్చిన జోన్నకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతి లేకుండా యుద్ధం చేసినందుకు జైల్లో పెట్టారు పరిణామాలు ఎలా ఉన్నా.. తాను మాత్రం ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానంటోంది ఈ సిరియా ఝాన్సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English