ఆన్ లైన్ లావాదేవీలు చేసేటోళ్లకు శుభవార్త

ఆన్ లైన్ లావాదేవీలు చేసేటోళ్లకు శుభవార్త

ఒకటి తర్వాత ఒకటిగా కేంద్రం కీలక నిర్ణయాల్ని తీసుకొంటోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాల్ని తీసుకుంటున్న కేంద్రం.. ఒకే రోజులోకీలకమైన మూడునిర్ణయాల్ని తీసుకుంది ఈ రోజేనని చెప్పాలి. గంటల వ్యవధిలో ఒకటి తర్వాత ఒకటిగా తీసుకున్న నిర్ణయాల్ని చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని మార్పుల దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్న భావన కలగటం ఖాయం.

పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంలో రెండు రోజుల క్రితం విధించిన పరిమితిని ఎత్తేసిన సర్కారు.. రూ.5వేలకు మించిన డిపాజిట్లను ఎంతైనా జమ చేయొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. జీతాలకు సంబంధించి నగదు రహితంగా చేయాలని.. అయితే చెక్కులతో కానీ  లేదంటే బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేయాలంటూ కేంద్రం ఆర్డినెన్స్ ను జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆన్ లైన్లో లావాదేవీలు జరిపే వాటిపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లావాదేవీలు వెయ్యి రూపాయిలకు పైన ఉండే మొత్తాలకు ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదని బ్యాంకులకు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లావాదేవీల్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ నిర్ణయం ఆయా వర్గాలకు శుభవార్తగా చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు