మనసున్న అమ్మాయి.. చదువు కోసం ప్రయత్నం

మనసున్న అమ్మాయి.. చదువు కోసం ప్రయత్నం

నిండా పదహారేళ్లు లేని అమ్మాయి మూడు స్కూళ్లు దత్తత తీసుకుంది. శ్రీమంతుడు మూవీని ఫాలో అయి కాదు. పాశ్చాత్య దేశాల్లో స్టెమ్ ఉద్యమంతో ప్రభావితమైంది. సాజ్ని వెదెరె మాట, మనసు, ఆలోచన అన్నీ ఘనంగానే ఉన్నాయి. స్టెమ్ ఆల్ స్టార్స్ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలూ చూస్తే ఆ విషయం తెలుస్తోంది.
         
అమెరికాలో జెఫర్ సన్ విద్యాసంస్థలో పదోతరగతి చదువుతున్న సాజ్ని.. తనలాగే అందరు బాలికలు బాగా చదువుకోవాలని కరోుకుంది. అప్పుడే స్టెమ్ ఉద్యమం ఆమెను ఆకర్షించింది. స్త్రీ, పురుష వివక్ష లేకుండా అందరికీ అన్ని విద్యలూ అందాలన్నది ఆశయంగా పెట్టుకుంది. చివరకు అనుకున్నది సాధించింది.
           
బాలురతో పోలిస్తే బాలికలకు విద్యావకాశాలు తక్కువగా ఉన్నాయన్న సంగిత గ్రహించిన సాజ్ని.. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించింది. యాప్ ద్వారా ఎక్కడ ఉన్నా.. అమెరికా స్కూల్ టీచర్లతో మాట్లాడే సౌలభ్యం వచ్చింది. దీంతో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నతవిద్య చేస్తున్నారు.
         
స్టెమ్ ఉద్యమం ప్రారంభించిన వెంటనే ఏపీకి వచ్చిన సాజ్ని.. ఇక్కడ దాదాపు గవర్నమెంట్ స్కూల్స్ బాలికలందర్నీ సభ్యురాళ్లుగా చేర్చుకుంది. మూడు స్కూళ్లను దత్తత తీసుకుని మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దింది. సాజ్ని ప్రయత్నానికి దాతల విరాళాలు తోడవడంతో.. ఇప్పుడు స్టెమ్ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు